సెనూరన్ ముత్తుసామి

From Wikipedia, the free encyclopedia

Remove ads

సెనూరన్ ముత్తుసామి (జననం 1994 ఫిబ్రవరి 22) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను 2019 అక్టోబరులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[1] ముత్తుసామి పూర్వీకులు తమిళనాడు లోని నాగపట్నంకు చెందినవారు. [2]

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
Remove ads

దేశీయ కెరీర్

ముత్తుసామిని 2015 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. [3] 2017 ఆగస్టులో అతను, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం కేప్ టౌన్ నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [4] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ దక్షిణాఫ్రికా మొదట్లో టోర్నమెంట్‌ను నవంబరు 2018కి వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది.[5]

2018 సెప్టెంబరులో అతను, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ జట్టులో ఎంపికయ్యాడు. [6] 2021 ఏప్రిల్లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు, అతను నార్త్ వెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [7]

2022 మార్చిలో, 2021–22 CSA వన్-డే కప్ టోర్నమెంట్ ప్రారంభ రోజున, వెస్ట్రన్ ప్రావిన్స్‌పై 106 బంతుల్లో 100 పరుగులతో లిస్టు A క్రికెట్‌లో ముత్తుసామి తన మొదటి సెంచరీని సాధించాడు.[8]

Remove ads

అంతర్జాతీయ కెరీర్

2019 ఆగస్టులో అతను, భారతదేశంతో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.[9] అతను 2019 అక్టోబరు 2న భారతదేశానికి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా తరపున తన తొలి టెస్టు ఆడాడు.[10] ఈ మ్యాచ్‌లో అతను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని 20 పరుగుల వద్ద కాట్ అండ్ బౌల్డ్‌గా అవుట్ చేసి, తన మొదటి టెస్టు మ్యాచ్ వికెట్ తీసుకున్నాడు. [11]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads