స్రవంతి

క్రాంతి కుమార్ దర్శకత్వంలో 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

స్రవంతి
Remove ads

స్రవంతి 1986, జనవరి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై కె. కేశవరావు, జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో క్రాంతి కుమార్[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్, సుహాసిని, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3] 1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారాన్ని అందుకుంది. రేవతి, సురేష్ ముఖ్యపాత్రలతో ఈ చిత్రం రేవతి పేరుతో తమిళంలో రిమేక్ చేయబడింది.

త్వరిత వాస్తవాలు స్రవంతి, దర్శకత్వం ...
Remove ads

కథా నేపథ్యం

స్రవంతికి క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది, అతను కొద్దిరోజుల తరువాత చనిపోతాడు. తన జీవితం చేసిన గాయం నుండి ఏదో ఒకవిధంగా బయటపడటానికి ప్రయత్నిస్తుంది. భార్యను కోల్పోయి ఒక చిన్న కుమార్తె వున్న మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆమె రెండవ భర్త ఆమె పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతలకు అసహనంగా మారుతుంది. చివరికి, ఆమె తన కుమార్తెను, తన మొదటి భర్త తల్లిదండ్రులను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.

Remove ads

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: క్రాంతి కుమార్
  • నిర్మాత: కె. కేశవరావు, జయకృష్ణ
  • సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • సంగీతం: కె. చక్రవర్తి
  • నిర్మాణ సంస్థ: ముద్దు ఆర్ట్ మూవీస్

పాటలు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4] వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.

  1. మౌనం ఆలాపన (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  2. నవ్వుతూ వెళ్ళిపో పువ్వులా (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads