హరే కృష్ణ మహతాబ్
భారత రాజకీయనేత From Wikipedia, the free encyclopedia
Remove ads
హరేకృష్ణ మహతాబ్, (1899 నవంబరు 21 - 1987 జనవరి 2) భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పేరుపొందిన వ్యక్తి. ఇతను 1946 నుండి 1950 వరకు, తిరిగి 1956 నుండి 1961 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను "ఉత్కల్ కేశరి" అనే ముద్దుపేరుతో ప్రసిద్ధి చెందాడు.
Remove ads
జీవితం తొలిదశ
హరేకృష్ణ మహతాబ్ ఒడిషా రాష్ట్రం, భద్రక్ జిల్లాలోని అగర్‌పడ్ గ్రామంలో జన్మించాడు.అతను ఒక కులీన ఖండాయత్ కుటుంబంలో కృష్ణ చరణ్ దాస్, తోపా దేబీ దంపతులకు జన్మించాడు.[1][2][3] భద్రక్ పట్టణంలోని ఉన్నత పాఠశాల నుండి తన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తరువాత, కటక్‌లోని రావెన్‌షా కశాశాలలో చేరాడు, కానీ 1921లో తన చదువును విడిచిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.[4][5][6]
రాజకీయ జీవితం
1922లో, మహతాబ్ జైలు పాలయ్యాడు.దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతను 1924 నుండి 1928 వరకు బాలసోర్ జిల్లా బోర్డు ఛైర్మనుగా పనిచేసాడు.అతను 1924లో బీహార్, ఒడిషా కౌన్సిల్ సభ్యుడయ్యాడు. అతను ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరి,1930లో మళ్లీ జైల్ పాలయ్యాడు. 1932లో పూరీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సభల కోసం కాంగ్రెస్ సేవాదళ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఎన్నికయ్యాడు. పార్టీని నిషేధించినప్పుడు అతడిని నిర్బందంలోకి తీసుకున్నారు. 1934లో అతను అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగినఉద్యమంలో ఒడిశాలో మొదటిసారిగా తన పూర్వీకుల ఆలయాన్ని తెరచి అందరికీ ప్రవేశం కల్పించాడు.తరువాత అగర్‌పడ్ లో అతనుగాంధీ కర్మమందిరాన్ని ప్రారంభించాడు. అతను1930 నుండి 1931 వరకు, మళ్లీ 1937లో ఉత్కల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.1938లో సుభాష్ చంద్రబోస్ చేత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నామినేట్ అయ్యాడు.1938 నుండి1946 వరకు, మళ్లీ 1946 నుండి1950 వరకు కొనసాగాడు. అతను1938లో రాష్ట్ర ప్రజల విచారణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు.సనద చట్టం రద్దు చేయాలని, పూర్వపు సంస్థానాలను ఒడిషా రాజ్యంలో విలీనం చేయాలని పాలకులకు సిఫారసు చేశాడు. అతను 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942 నుండి 1945 వరకు జైలు శిక్ష అనుభవించాడు.[7][8]
మహతాబ్ 1946 ఏప్రిల్ 23 నుండి1950 మే 12 వరకు ఒడిశా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను 1950 నుండి1952 వరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిగా,1952లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసాడు. అతను 1955 నుండి 1956 వరకు బొంబాయి గవర్నర్‌గా వ్యవహరించాడు.[8][9][10] 1956లో గవర్నర్ పదవికి రాజీనామాచేసి, మళ్లీ 1956 నుండి 1960 వరకు ఒడిశా ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, పూర్వపు రాచరిక రాష్ట్రాల విలీనం, సమైక్యత, రాజధానిని కటక్ నుండి భువనేశ్వర్‌కు మార్చడం, బహుళ ప్రయోజన హీరాకుడ్ డ్యాం మంజూరు నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను 1962లో అంగుల్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.1966లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.1966లో, అతను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఒరిస్సా జన కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాడు. అతను 1967, 1971,1974లో ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. అత్వసర పరిస్థితికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు 1976లో జైలుపాలయ్యాడు.[11]
Remove ads
మేధోపరమైన ప్రయత్నాలు
అతను ప్రజాతంత్ర ప్రచార సమితి స్థాపకుడు.1923లో బాలసోర్‌లో వారపత్రిక ప్రజాతంత్రను ప్రారంభించాడు. తరువాత అది రోజువారీ ప్రజాతంత్ర పత్రికగా మారింది. జనాకర్ అనే మాసపత్రిక ఆవిర్భావం నుండి దానికి అతను ప్రధాన సంపాదకులుగా ఉన్నాడు.అతను ది ఈస్టర్న్ టైమ్స్ అనే ఆంగ్ల వారపత్రిక కూడా ప్రచురించాడు. దానికి అతను ముఖ్య ఎడిటరుగా పనిచేసాడు. అతను 1983లో తన రచన గావ్ మజ్లిస్ మూడవ వాల్యూంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు.[12]
అవార్డులు, గౌరవాలు
అతను ఒరిస్సా సాహిత్య అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీకి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నాడు.గౌరవ డి. లిట్ ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి, సాగర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[13][14] ఒడిషా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, ఒడిషా స్టేట్ పబ్లిక్ అత్యున్నత లైబ్రరీ సిస్టమ్ అతని పేరును హరేకృష్ణ మహతాబ్ స్టేట్ లైబ్రరీగా పేర్కొనబడింది.ఇది1959లో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మూడు ఎకరాల ప్రాంగణంతో స్థాపించబడింది [15][16]
Remove ads
ప్రస్తావనలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads