హిగ్గ్స్ బోసన్
From Wikipedia, the free encyclopedia
Remove ads
హిగ్గ్స్ బోసన్ అనేది ఒక మూల పదార్థము. ఇది విశ్వం ఆవిర్భవించినపుడు, పుట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది విశ్వంలోని పదార్థానికి మూలపదార్థము. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు, బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇంకా ప్రయోగాలు జరుపుతున్నారు. 2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల ద్వారా ఈ హిగ్స్ బోసాన్ అనేది ఒకటి ఉందని తొలిసారి స్పష్టమైంది. వీరు చేసిన ప్రయోగాలతో అన్నింటి యొక్క గుట్టు విప్పారు, కాని ఈ పదార్థం గురించి మాత్రం ఎవరు కనుగొనలేకపోయారు. హిగ్గ్స్ బోసన్ అనే పదార్థము, కృష్ణ పదార్థము, కృష్ణశక్తి అనేవి విశ్వ వ్యాప్తి కి కారణమవుతున్నయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |


ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ సైన్సులో చేసిన కృషికి గాను ఆయన పేరు మీదుగా ఈ కణాలకి బోసన్లు అని పేరు పెట్టారు.[1][2]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads