హైదరాబాద్ మేయర్ల జాబితా
From Wikipedia, the free encyclopedia
Remove ads
హైదరాబాద్ మేయర్, హైదరాబాదు మహానగరపాలక సంస్థకు మేయర్.
పద వివరణ
నగర పాలక సంఘంలకు, పట్టణ పురపాలక సంఘంలకు ఎన్నికలు ముగిసిన తరువాత, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ లేదా నగర మేయర్ అంటారు.[1]
జిహెచ్ఎంసి ఏర్పాటు
నిజాం ప్రభుత్వం 1869లో మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చి, హైదరాబాద్, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఈ రెండింటిని కలిపి 1933లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)’గా మార్చారు.
2007, ఏప్రిల్ 16న రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు (ఎల్.బి. నగర్, గడ్డి అన్నారం, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్, కుతుబుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు) 8 గ్రామ పంచాయతీలు (శంషాబాద్, సతమరై, జల్లపల్లి, మమిడిపల్లి, మఖ్తల్, అల్మాస్ గూడా, సర్దానగర్, రావిరాల) హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో విలీనం చేయడం ద్వారా హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఏర్పడింది.
2005జూలై లో ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ) 261 జారీ చేయగా, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటుకు సంబంధించిన జి.ఓ. నెంబరు 261 ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007, ఏప్రిల్ 16న ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం 2019లో హైదరాబాదు మహానగరపాలక సంస్థను ఆరు మండలాలుగా (దక్షిణ, తూర్పు, ఉత్తర, ఈశాన్య, పశ్చిమ, మధ్య మండలాలు), 150 వార్డులుగా విభజించింది.[2][3]
Remove ads
జాబితా
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads