1971 నుండి 1981 వరకు దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ క్రికెట్
From Wikipedia, the free encyclopedia
Remove ads
1971 - 1981 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు రాజకీయంగా, సాంఘికంగా అవలంబించిన జాతివివక్ష, వర్ణ ఆధారిత విభజన పద్ధతులు (అపార్తీడ్) క్రికెట్లో కూడా అమలుచేయడం వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలు, వివాదాల వల్ల 1971 నుండి 1981 వరకు అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా పాల్గొనేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆనాటి దక్షిణాఫ్రికా ప్రభుత్వాల వర్ణ ఆధారిత విభజన విధానాల వల్ల టెస్ట్ క్రికెట్ ఆడే ముఖ్యమైన దేశాలు ఏవీ దక్షిణాఫ్రికాలో తమ జట్లు పర్యటించేందుకు ఇష్టపడలేదు. స్పోర్ట్స్ ప్రమోటర్ డెరిక్ రాబిన్స్ ఏర్పాటుచేసిన నాలుగు ప్రైవేట్ టూర్లు, "ఇంటర్నేషనల్ వాండరర్స్" అన్న ప్రైవేట్ జట్టు చేసిన రెండు పర్యటనలు, ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ మినహాయిస్తే అంతర్జాతీయ పోటీలేమీ దక్షిణాఫ్రికాలో ఆ దశకంలో సాధ్యపడలేదు. తద్వారా అప్పట్లో దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన గ్రేమ్ పొలాక్, బారీ రిచర్డ్స్, క్లైవ్ రైస్, ఎడ్డీ బార్లో వంటి స్టార్ క్రికెటర్లకు తమ సామర్థ్యానికి తగిన ఆట ఆడే వీలు కానీ, ప్రపంచ క్రికెట్‌కు వారి ఆటను ఆస్వాదించే అవకాశం కానీ లేకుండా పోయింది.
Remove ads
నేపథ్యం
దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులు స్థిరపడినప్పటి నుండి క్రీడలు జాతి ప్రాతిపదికన విభజనకు గురయ్యాయి. క్రికెట్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
దక్షిణాఫ్రికాలోని శ్వేతేతర జాతివారు ఏ విధమైన అంతర్జాతీయ క్రికెట్ అయినా ఆడేందుకు 1956 వరకూ అవకాశం లభించలేదు. 1956లో కెన్యన్ ఆసియన్ల బృందం దక్షిణాఫ్రికా శ్వేతేతర జట్టుపై పోటీచేసేవరకూ నల్లజాతి వారికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశమే రాలేదు.అయితే, కాలక్రమేణా వర్ణ విభజన, వివక్ష విధానాలు కఠినంగా మారడం, 1948లో చట్టబద్ధం కావడంతో, జాతీయ టెస్టు జట్టుకు తెల్లవారు మినహా శ్వేతేతర ఆటగాడు ఎవరూ ఎంపిక కాలేదు. ఇది ఎలా ఉన్నా, తెల్లవారు మెజారిటీగా ఉన్న కామన్వెల్త్ దేశాలు పూర్తిగా తెల్లజాతీయులతో కూడిన దక్షిణాఫ్రికా జట్లతో క్రికెట్ ఆడడం మాత్రం కొనసాగింది.
ఈ పరిస్థితి 1967-70 మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మార్చివేశాయి.
బాసిల్ డి ఒలివెరా వివాదం
బాసిల్ డి ఒలివెరా దక్షిణాఫ్రికాకు చెందిన మిశ్రమ జాతి వ్యక్తి. దక్షిణాఫ్రికాలో అమలవుతున్న అపార్తీడ్ విధానాలు అతన్ని శ్వేతజాతీయునిగా కాక కలర్డ్ లేక పాక్షికంగా నల్లజాతీయుడు అని విభజించాయి. ఆ విధానాల ప్రకారం తెల్లవారికే దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టులో స్థానం ఉండడంతో, ఇతను దానిలో ఆడడానికి అనర్హుడయ్యాడు. అందువల్ల ఇంగ్లండ్ వలసవెళ్ళి అక్కడ వారికోసం ఆడడం ప్రారంభించాడు. ఆ క్రమంలో ఇంగ్లండ్ జట్టు సభ్యునిగా 1967లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళాడు. ఆ పర్యటనలో ఇతని ప్రదర్శన అంత బాగోలేదు. యాషెస్‌లో మొదటి నాలుగు టెస్టుల్లో అతన్ని ఆడించలేదు. ఆఖరిదైన ఐదవ టెస్టులో మాత్రం ఆడే అవకాశం లభించగా, అతను అందులో 158 పరుగులు చేశాడు. దానితో ఆ ఏడాది జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు అతను ఎంపికవుతాడన్న భావన ఉంది.
అయితే, దక్షిణాఫ్రికా పర్యటనకు అతను మొదట ఎంపిక కాలేదు. దానితో ఇంగ్లండ్‌లో పెద్ద వివాదం జరిగింది. ఆ వార్త వినగానే డి ఒలివెరా కన్నీళ్ళు పెట్టుకున్నాడన్నది వార్తల్లో ప్రముఖంగా వచ్చింది. దక్షిణాఫ్రికాలోని అపార్తీడ్ పాలనకు, వారి జాత్యాహంకారానికి ఇంగ్లండ్ సెలక్టర్లు మద్దతునిస్తున్నారని అందుకనే డి ఒలివెరాని ఎంపికచేయలేదని ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఇంగ్లండ్ క్రీడాకారుడు టామ్ కార్ట్‌రైట్ కౌంటీ క్రికెట్ ఆడుతూ అనారోగ్యం పాలవడంతో ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి డీ ఒలివెరాని సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ వార్త తెలియగానే ఆనాటి దక్షిణాఫ్రికా ప్రధాని జాన్ వోస్టర్ ఈ ఎంపికపై వ్యతిరేకత తెలియజేస్తూ "అది మేరీలెబన్ క్రికెట్ క్లబ్ జట్టు కాదని, అపార్తీడ్ వ్యతిరేకోద్యమ జట్టు అని" ఆరోపించాడు. ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను వెంటనే రద్దుచేశారు.
ఇంత జరిగినా, ఆస్ట్రేలియా 1969-70ల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది, దక్షిణాఫ్రికా జట్టు వారిని 4-0తో వైట్‌వాష్ చేసి, తమను ఆనాటి క్రికెట్లో డీ-ఫాక్టో ప్రపంచ ఛాంపియన్లుగా నిరూపించుకుంది. దక్షిణాఫ్రికా ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టుతో అధికారికంగా టెస్టు క్రికెట్ ఆడడం దీని తర్వాత మరో 22 ఏళ్ళ వరకూ సాధ్యపడలేదు. 1970లో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్ పర్యటన రద్దయింది. ఇంగ్లండ్ ఆదరాబాదరగా ముగ్గురు దక్షిణాఫ్రికన్లు, ఒక దక్షిణాఫ్రికాలో జన్మించిన క్రికెటర్‌తో కూడిన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టీమ్ ఏర్పాటుచేయించి దానితో ఇంగ్లండ్ పర్యటన చేయించింది.
గ్యారీ సోబర్స్ రొడేషియా వివాదం
1970 సెప్టెంబరులో వెస్టిండీస్ కెప్టెన్ గ్యారీ సోబర్స్ రోడేషియాలో ఒక తరహా క్రికెట్ పోటీ అయిన డబుల్-వికెట్ పోటీలో ఆడాడు. ఈ పర్యటన ఒక వివాదానికి దారితీసింది . సోబర్స్ సాలిస్బరీలో కేవలం 48 గంటలు మాత్రమే గడిపినా, అతను రొడేషియా ప్రధానమంత్రి, వివాదాస్పద అపార్తీడ్ అనుకూల నేత ఇయాన్ స్మిత్‌ని కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత అతన్ని గురించి "అతని మాట్లాడడం చాలా గొప్పగా ఉంటుంది" (గ్రేట్ మ్యాన్ టు టాక్ టు) అని ప్రశంసించాడు.
రొడేషియా అన్నది దక్షిణ-మధ్య ఆఫ్రికాలో 1965-1979 వరకూ కొనసాగిన అంతర్జాతీయ గుర్తింపులేని దేశం. ఆ దేశానికి అప్పట్లో ప్రధానమంత్రిగా పనిచేసిన ఇయాన్ స్మిత్ ఆ ప్రాంతాన్ని తెల్లవారే పరిపాలించాలన్న సిద్ధాంతానికి, తెల్లవారూ, నల్లవారూ విడివిడిగా ఉండేలా చూసే అపార్తీడ్ సిద్ధాంతాలకు గట్టి మద్దతుదారు.[1][2] ఆనాటి దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి సిద్ధాంతాలు, విధానాలే ఉండేవి.[3]
సోబర్స్ ఆ టోర్నమెంట్లో పాల్గోవడం, అలాంటి ప్రకటన చేయడం వర్ణవివక్షని, జాత్యాహంకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అతని స్వంత ప్రాంతమైన కరేబియన్ రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. వెస్టిండీస్ క్రికెట్ జట్టు కరేబియన్ ప్రాంతంలో ఆంగ్లం మాట్లాడే వివిధ దేశాలకు ఉమ్మడి క్రికెట్ జట్టు. ఆ దేశాల్లో భాగమైన గయానా దేశపు ప్రధాని ఫోర్బ్స్ బర్న్‌హామ్ ఈ విషయంపై స్పందిస్తూ తన చర్యలకు, వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేదాకా సోబర్స్‌ను తన దేశంలోకి రానివ్వమని తేల్చిచెప్పాడు. కెప్టెన్ పదవికి సోబర్స్ తనంతట తానే రాజీనామా చేయాలని లేదంటే తాము తొలగిస్తామని జమైకా ప్రభుత్వం సూచించింది. ఈ వివాదానికి ఒక పరిష్కారం వచ్చేదాకా భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించరాదని భారత ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయించింది.
సోబర్స్ తాను ఎలాంటి తప్పూ చేయలేదనీ, తాను క్రికెటర్‌నే కానీ రాజకీయ నాయకుడిని కానందువల్ల ఇందులో ఏ తప్పూ లేదని వాదించాడు. కానీ, ఈ వివాదం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విచ్ఛిన్నానికి దారితీసేలా ఉండడంతో 1970 అక్టోబరులో క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ముగింపు పలికాడు.[4]
1970లు, 1980లలో, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు హోవా బౌల్ అనే టోర్నమెంటును నిర్వహించేది, ఇది పూర్తిగా తెల్లజాతికి చెందనివారి జట్ల మధ్య పోటీ. దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అయిన కర్రీ కప్‌లో తెల్లవాళ్ళు మినహా మరెవ్వరూ పాల్గొనడానికి ఉండేది కాదు. దానితో దీన్ని శ్వేతేతర జాతీయుల కోసం నిర్వహించేవారు.
Remove ads
1971
1971లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనకు ప్రయత్నం చేసింది. ఇందుకోసం నల్లజాతి ఆటగాళ్ళు డిక్ అబేద్, ఓవెన్ విలియమ్స్ కూడా తమ జట్టులో భాగం అని ప్రకటన కూడా చేసింది. అయితే, ఈ ప్రకటనను, ప్రతిపాదనను అబేద్, విలియమ్స్ తిరస్కరించారు.
అదే ఏడాది ఇంగ్లిషువాడైన కోలిన్ కౌడ్రీ జాతిపరంగా మిశ్రిత జట్టును దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకువెళ్ళి దక్షిణాఫ్రికా నల్లజాతి జట్టుతోనూ, తెల్లజాతి జట్టుతోనూ వేర్వేరుగా క్రికెట్ ఆడాలన్న ప్రయత్నం చేశాడు. కలర్డ్ క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. బాసిల్ డి ఒలివెరాను ఈ ఇంగ్లండ్ జట్టులో ఉండొద్దని సూచించి ఒప్పించింది.
ఆనాటి దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫ్రాంక్ వారింగ్ మాట్లాడుతూ క్లబ్ స్థాయి కన్నా పైస్థాయిలో ఆడే క్రికెటర్లు అన్నిజాతులవారూ కలగలిసి ఆడే క్రికెట్ విషయంలో అనుకూలంగా ఉంటే, సంబంధిత అధికారులు తన వద్దకు వచ్చి మాట్లాడొచ్చనీ, ఒకవేళ ఇదే గనుక వారి తీర్మానమైతే ఈ అంశాన్ని క్యాబినెట్లో ప్రస్తావించడానికి పూర్తిగా సంసిద్ధుడినై ఉన్నానని పేర్కొన్నాడు.
1971 మే 3న రెస్ట్ ఆఫ్ దక్షిణాఫ్రికా XIకి, కర్రీ కప్ ఛాంపియన్స్ ట్రాన్స్వాల్కీ మధ్య జరుగుతున్న పోటీలోంచి ప్రభుత్వం అనుసరిస్తున్న క్రీడా విధానాలకు వ్యతిరేకంగా న్యూలాండ్స్‌లో మైదానం నుండి ఆటగాళ్ళు వాక్ ఆఫ్ చేశారు. ప్రఖ్యాత దక్షిణాఫ్రికా వ్యాఖ్యాత చార్లెస్ ఫార్చూన్ మాట్లాడుతూ ఆడటానికి నిరాకరించడం అన్నది ప్రభుత్వ చర్యలకు పరోక్షంగా సాయపడుతుందని, అందుకు బదులుగా బదులు మైదానానికి వచ్చి వాకాఫ్ చేయడమే ఉత్తమమని సూచించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో గ్రేమ్ పొలాక్ (కెప్టెన్), మైక్ ప్రోక్టర్, విన్సెంట్ వాన్ డెర్ బిజ్ల్, పీటర్ పొలాక్, హిల్టన్ అకెర్మాన్, డెనిస్ లిండ్సే, గ్రాహం చెవాలియర్, ఆర్థర్ షార్ట్, ఆండ్రీ బ్రూయిన్స్ ఉన్నారు. ట్రాన్స్వాల్కు చెందిన ఆటగాళ్లలో బారీ రిచర్డ్స్ (అతిథి ఆటగాడు), బ్రియాన్ బాత్, క్లైవ్ రైస్, పీటర్ కార్ల్స్టీన్, డాన్ మాకే-కోగిల్ (కెప్టెన్) ఉన్నారు.
దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ మరోపక్క అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ అందులో భాగంగా న్యూజీలాండ్ జట్టుని దక్షిణాఫ్రికాకు ఆహ్వానించింది. దక్షిణాఫ్రికా ఒక బహుళ జాతులతో కూడిన జట్టును రూపొందిస్తుందనీ, ఇంగ్లండ్ వెళ్ళే మార్గంలో దక్షిణాఫ్రికాలో ఆగి ఆ జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడమనీ అభ్యర్థించింది. న్యూజీలాండ్ ఈ ఆఫర్‌ని తిరస్కరించింది.
Remove ads
1972
న్యూజీలాండ్ మహిళల టెస్ట్ జట్టు 1972 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బ్రియాన్ క్లోజ్ కెప్టెన్సీలోని ఇంటర్నేషనల్ వాండరర్స్ సైడ్ అన్న జట్టును దక్షిణాఫ్రికా పొరుగున శ్వేతజాతి మైనారిటీ పాలనలో ఉన్న ఆఫ్రికా దేశం రోడేషియా ఆకర్షించింది. ఆ జట్టులో తొమ్మిది మంది టెస్ట్ ఆటగాళ్ళు ఉన్నారు, వారిలో బాసిల్ డి ఒలివెరా కూడా ఒకరు. వాళ్ళు రెండు మ్యాచ్‌లే ఆడారు. 1972 సెప్టెంబరు 23-25 మధ్య జరిగిన మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 సెప్టెంబరు 29-అక్టోబరు 2 తేదీల మధ్య జరిగిన 4-రోజుల మ్యాచ్‌లో రొడేషియా 411 పరుగులతో సులభంగా గెలిచింది. ఈ జట్టు కూడా దక్షిణాఫ్రికాలో పర్యటించలేదు. ఈ పోటీల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు మైక్ ప్రాక్టర్ రోడేషియా తరఫున ఆడాడు.
1973
1973 జనవరి, ఫిబ్రవరి డిహెచ్ రాబిన్స్ XI పర్యటన
1973 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 6 వరకూ కోటీశ్వరుడైన వ్యాపారవేత్త డెరిక్ రాబిన్స్ ప్రైవేట్ XI టీమ్ తయారుచేసి దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకువచ్చాడు. ఈ డెరిక్ రాబిన్స్ కోవెంట్రీ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఛైర్మన్‌గా వ్యవహరించడంతో పాటుగా అప్పటికే అనేక ప్రైవేట్ క్రికెట్ పర్యటనలను నిర్వహించినవాడిగా క్రీడా రంగంలో పేరొందిన మనిషి. అతని XIలో చాలా మంది ఇంగ్లండ్ టెస్ట్ ఆటగాళ్ళు ఉన్నారు. దక్షిణాఫ్రికన్లు మళ్ళీ వీళ్ళని ఆహ్వానించేంత బాగా ఆడాలన్నది రాబిన్స్ లక్ష్యం. ఆటగాళ్ళకు కూడా ఇంగ్లండ్ టెస్ట్ సెలక్టర్లు తమ ప్రదర్శనను గమనిస్తారని తెలుసు.
తన జట్టుని అపార్తీడ్ దక్షిణాఫ్రికాలో పర్యటింపజేయాలన్న నిర్ణయంపై కొన్ని విమర్శలు తలెత్తాయి. దాన్ని రాబిన్స్ కొట్టిపారేస్తూ, "రాజకీయ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకోవట్లేదు, కానీ నేనేం చెప్తానంటే: మాది ప్రైవేటు పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ల జట్టు, మాకు ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరితో ఆడమన్నా ఆడడానికి సిద్ధంగా ఉన్నాం." అన్నాడు. ఈ పర్యటనకు వ్యతిరేకతను సమీకరించాలన్న ప్రయత్నం ఇంగ్లండులో విఫలమైంది.
ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా XIతో జరిగిన 4-రోజుల మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌తో పర్యటన ముగిసింది. పర్యటనకు వచ్చిన జట్టు కూడా ఆటని సీరియస్‌గానే తీసుకుందని, ఊరికే సరదాగా క్రికెట్ హాలీడేకి రాలేదని వాళ్ళ ఆట ద్వారా చూపించారు. ఈ ఆటలో దక్షిణాఫ్రికా ప్రపంచ క్రికెట్ సముదాయం నుంచి బహిష్కరణకు గురవకముందు టెస్ట్ మ్యాచ్‌లు ఆడినవారితో సహా అందరు ముఖ్యమైన దక్షిణాఫ్రికా క్రికెటర్లూ ఆడారు.
డీహెచ్ రాబిన్స్ XI ఈ ఆటలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం తప్పిదంగా తేలింది. బారీ రిచర్డ్స్ సెంచరీ చేయగా, ఆండ్రీ బ్రుయిన్స్ 97 పరుగులు చేశారు. మొత్తానికి దక్షిణాఫ్రికా XI 387 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్‌తో డిహెచ్ రాబిన్స్ XI రెండుసార్లు 160 పరుగుల్లోపు ఔటైంది, ఏ ఆటగాడు 32 కంటే ఎక్కువ స్కోర్ చేయలేదు. మొత్తానికి మ్యాచ్ 3 రోజుల్లో ముగిసింది. నాలుగో రోజు 50 ఓవర్ల ఆట జరిగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఒక వికెట్‌తో ఆధిక్యత సాధించింది.
డిహెచ్ రాబిన్స్ XI జట్టులో ఉన్నవారు: టోనీ బ్రౌన్ ; డేవిడ్ బ్రౌన్; ఫ్రాంక్ హేస్ ; జాకీ హాంప్‌షైర్ ; రాబిన్ హాబ్స్ ; డేవిడ్ హ్యూస్ ; రాబిన్ జాక్మన్ ; రోజర్ నైట్ ; జాన్ లివర్ ; పీటర్ లెవింగ్టన్ ; ఆర్నాల్డ్ లాంగ్ ; జాన్ ముర్రే ; క్లైవ్ రాడ్లీ ; మైక్ స్మిత్ ; డేవిడ్ టర్నర్ ; పీటర్ విల్లీ ; బాబ్ విల్లిస్ ; 160 పరుగుల్లోపు ఔటైంది, ఏ ఆటగాడు 32 కంటే ఎక్కువ స్కోర్ చేయలేదు. మొత్తానికి మ్యాచ్ 3 రోజుల్లో ముగిసింది. నాలుగో రోజు 50 ఓవర్ల ఆట జరిగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఒక వికెట్‌తో ఆధిక్యత సాధించింది.
దక్షిణాఫ్రికా ఇంటర్నేషనల్ XI (వాస్తవానికి దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం)లో ఉన్నవారు: అలీ బాచర్ (కెప్టెన్); ఎడ్డీ బార్లో ; ఆండ్రీ బ్రుయిన్స్ ; జాకీ డు ప్రీజ్ ; లీ ఇర్విన్ ; డోనాల్డ్ మాకే-కోగ్హిల్ ; కెన్ మెక్ఇవాన్ ; మైక్ ప్రోక్టర్ ; బారీ రిచర్డ్స్ ; పీటర్ స్వార్ట్. వీరితో పాటుగా, విన్సెంట్ వాన్ డెర్ బిజ్ల్ వన్డే మ్యాచ్‌లో ఆడాడు. అయితే, 4-రోజుల మ్యాచ్ ఆడిన జట్టులో అతను లేడు; ఇందుకు బదులుగా రూపర్ట్ హాన్లీ 4-రోజుల మ్యాచ్‌లో ఆడాడు, కానీ వన్డే మ్యాచ్‌లో ఆడలేదు.
1973 అక్టోబరు-డిసెంబరు డిహెచ్ రాబిన్స్ XI పర్యటన
తర్వాతి సీజన్లో, డెరిక్ రాబిన్స్ ఇంకొక పర్యాటక బృందాన్ని ఏర్పాటుచేసి దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకువెళ్ళాడు. 1973 మొదట్లో పర్యటించిన వారిలో మైక్ స్మిత్, జాన్ లీవర్ మాత్రమే ఈ పర్యటనకు వెళ్లారు. జట్టులోని ఆటగాళ్లు ఎక్కువగా ఆంగ్లేయులు కాగా, ఇతర దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో పాకిస్థానీ ఆటగాడు యూనిస్ అహ్మద్, వెస్టిండీస్ ఆటగాడు జాన్ షెపర్డ్ ఉన్నారు. టూరింగ్ స్క్వాడ్‌లోని ఇతర ఆటగాళ్లు వీళ్ళు:
- బ్రియాన్ క్లోజ్ (కెప్టెన్); రే ఈస్ట్ (ఇంగ్లిష్); జాన్ ఎడ్రిచ్ (ఇంగ్లిష్); బ్రూస్ ఫ్రాన్సిస్ (ఆస్ట్రేలియన్); జాన్ గ్లీసన్ (ఆస్ట్రేలియన్); గ్రాహం జాన్సన్ (ఇంగ్లిష్); పీటర్ లీ (ఇంగ్లిష్); గ్రాహం రూప్ (ఇంగ్లిష్); జాన్ స్నో (ఇంగ్లిష్); రోజర్ టోల్చార్డ్ (ఇంగ్లిష్); బాబ్ వూల్మెర్ (భారతదేశంలో జన్మించిన దక్షిణాఫ్రికా క్రికెటర్, ఇతను ఇంగ్లండ్ తరపున ఆడేవాడు)
మ్యాచ్‌ల వివరాలూ, ఫలితాలూ ఇలా ఉన్నాయి:
Remove ads
1974-1975
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads