1975 క్రికెట్ ప్రపంచ కప్

From Wikipedia, the free encyclopedia

1975 క్రికెట్ ప్రపంచ కప్
Remove ads

1975 క్రికెట్ ప్రపంచ కప్, పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ పోటీలలో తొట్తతొలి టోర్నమెంటు. దీన్ని అధికారికంగా ప్రుడెన్షియల్ కప్ '75 అని పిలుస్తారు. వన్ డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ చరిత్రలో ఇది మొట్టమొదటి ప్రధాన టోర్నమెంటు. అంతర్జాతీయ క్రికెట్ కాన్ఫరెన్స్ (ICC) నిర్వహించిన ఈ టోర్నమెంటు, 1975 జూన్ 7 నుండి జూన్ 21 వరకు ఇంగ్లాండ్‌లో జరిగింది.

త్వరిత వాస్తవాలు తేదీలు, నిర్వాహకులు ...

ఈ టోర్నమెంట్‌ను ప్రుడెన్షియల్ అస్యూరెన్స్ కంపెనీ స్పాన్సర్ చేసింది. ఇందులో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి: ఆ సమయంలో టెస్టులు ఆడుతున్న ఆరు జట్లు - ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ లతో పాటు రెండు ప్రముఖ అసోసియేట్ దేశాలు - శ్రీ లంక, తూర్పు ఆఫ్రికా లు పాల్గొన్నాయి. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు, తమ గ్రూపు లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది; గ్రూప్ లోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌ల విజేతలు ఫైనల్‌లో తలపడతాయి. ప్రతి మ్యాచ్‌లో ఒక్కో జట్టుకు 60 ఓవర్లు ఉంటాయి. సాంప్రదాయికంగా ధరించే తెల్లని దుస్తులతో, ఎరుపు రంగు బంతులతో ఆడారు; అన్నీ పగటిపూటనే ఆడారు.

ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు గ్రూప్ Aలో మొదటి రెండు జట్లుగా నిలిచాయి. గ్రూప్ B పట్టికలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా కంటే ముందు నిలిచింది. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను ఓడించగా, వెస్టిండీస్ న్యూజిలాండ్‌ను ఓడించింది. తర్వాత, టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా వచ్చిన వెస్టిండీస్, లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి మొదటి ప్రపంచ కప్ విజేతగా అవతరించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్, గ్లెన్ టర్నర్ 333 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరుగా నిలిచాడు. ఆస్ట్రేలియన్ బౌలర్ గ్యారీ గిల్మర్ చివరి రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడినప్పటికీ 11 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలరుగా నిలిచాడు.

Remove ads

ఫార్మాట్

1975 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఎనిమిది జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒకసారి ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు జూన్ 7 నుంచి 14 వరకు జరిగాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్ 18న సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక్కడి విజేతలు జూన్ 21న లార్డ్స్‌లో ఫైనల్‌లో ఆడాయి. రోజంతా వర్షం కురిసి ఆట ఆగితే, జట్లు రెండు రిజర్వ్ రోజులలో ఒకదాన్ని ఉపయోగించుకోవచ్చు.[1] మొదటి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌లో ఏడు వేదికలను ఉపయోగించారు.[2]

Remove ads

పాల్గొన్నవారు

Thumb
1975 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొన్న దేశాలు హైలైట్ చేయబడ్డాయి.

ప్రపంచ కప్‌లో పోటీ చేయడానికి ఎనిమిది జట్లను ఆహ్వానించారు. ఆ దేశాలలో ఆరు దేశాలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి సభ్యులుగా ఉండగా, మిగిలిన రెండు - శ్రీలంక, తూర్పు ఆఫ్రికా. దక్షిణాఫ్రికా కూడా టోర్నమెంట్‌లో ఆడవలసి ఉంది గానీ దేశంలోని వర్ణవివక్ష చట్టాల కారణంగా, ఆ జట్టు 1992 ప్రపంచ కప్పు వరకు పోటీల్లో పాల్గొనే అర్హత లభించలేదు.[1]

మరింత సమాచారం జట్టు, అర్హత విధానం ...
Remove ads

వేదికలు

1973 జూలై 26 న టోర్నమెంటు ఫైనల్ పోటీ లార్డ్స్‌లో జరుగుతుందని వెల్లడించడంతో వేదికల ప్రకటన ప్రారంభమైంది. [1] 1975 సీజన్‌లో జరిగే ఐదు కౌంటీ టోర్నమెంట్‌లతో పాటుగా టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో మిగిలిన వేదికలు 1974 నవంబరు 5 న వెల్లడయ్యాయి. హెడింగ్లీ, ది ఓవల్‌లు సెమీ-ఫైనల్‌కు హోస్ట్‌లుగా నిర్ధారించారు. [3]

మరింత సమాచారం లండన్, బర్మింగ్‌హామ్ ...

టోర్నమెంటుకు ముందు

ఫాస్ట్ షార్ట్ పిచ్ బౌలింగ్ కారణంగా బ్యాట్స్‌మెన్ తలకంటే ఎత్తుగా వెళ్లే బంతులను వైడ్ అని పిలవాలని, ప్రపంచ కప్‌కు ఎనిమిది రోజుల ముందు, ఐసిసి ఏకగ్రీవంగా ప్రకటించింది. [4]

గ్రూప్ దశ

సారాంశం

జూన్ 7న ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లు నాలుగు జరిగాయి. లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 60 ఓవర్లలో 334 పరుగులతో అత్యధిక స్కోరు సాధించింది. డెన్నిస్ అమిస్ 147 బంతుల్లో 137 పరుగులు చేయగా, కీత్ ఫ్లెచర్, క్రిస్ ఓల్డ్‌లు ఒక్కొక్కరు హాఫ్ సెంచరీ నమోదు చేసారు. ప్రతిస్పందనగా, సునీల్ గవాస్కర్ ఇన్నింగ్స్‌ మొత్తం బ్యాటింగు చేసి 36 పరుగులే చేశాడు. గులాబ్రాయ్ రాంచంద్, గవాస్కర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని భావించాడు.[5] హెడ్డింగ్లీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. డెన్నిస్ లిల్లీ ఐదు వికెట్లు పడగొట్టడం దీనికి కారణం. పాకిస్తాన్, ఒకదశలో నాలుగు వికెట్ల నష్టానికి 181 స్థితి నుండి 205 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు, ఆస్ట్రేలియా తరపున రాస్ ఎడ్వర్డ్స్ 80 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. అతను చివరి 13 ఓవర్లలో 94 పరుగులు చేయడంలో సహాయపడి ఆస్ట్రేలియాను 60 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులకు చేర్చాడు.[6][7] మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, న్యూజిలాండ్‌లు సులువుగా గెలిచాయి. గ్లెన్ టర్నర్ మొత్తం న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ అంతా క్రీజ్‌లో ఉండి, 171 పరుగులు చేసాడు. ఈస్ట్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ 181 పరుగుల తేడాతో గెలిచింది. పరిమిత ఓవర్ల వన్డే ఇంటర్నేషనల్ (ODI) లో 100 కంటే తక్కువ పరుగులు చేసిన మొదటి జట్టుగా నిలిచిన శ్రీలంకపై వెస్టిండీస్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.[8]

ఆపరేషన్ కారణంగా ఆసిఫ్ ఇక్బాల్, పరీక్షల కారణంగా ఇమ్రాన్ ఖాన్ లు ఆడనప్పటికీ పాకిస్తాన్, రెండో రౌండ్ గేమ్‌లలో 60 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. స్టాండింగ్ కెప్టెన్ మజిద్ ఖాన్ టాప్ స్కోర్ చేశాడు.[9] ప్రతిస్పందనగా, వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులకు పడిపోయింది. ఇందులో బెర్నార్డ్ జూలియన్, క్లైవ్ లాయిడ్, కీత్ బోయ్స్ అందరూ తమ వికెట్లను కోల్పోయారు. కానీ చివరి వికెట్‌లో డెరిక్ ముర్రే, ఆండీ రాబర్ట్స్ జోడీ బాగా బ్యాటింగు చేయడాంతో వెస్టిండీస్ ఆఖరి ఓవర్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది.[10] గ్రూప్ Bలోని ఇతర మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని సాధించింది. అయితే జెఫ్ థామ్సన్ నో-బాల్ సమస్య కారణంగా ఇంగ్లీష్ మీడియా ఆస్ట్రేలియా ప్రణాళికలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో వివాదం రేగింది. అతను, "నేను ఇంతకు ముందు ఇంగ్లండ్‌లో ఇలాంటివి చూశాను" అని అన్నాడు.[11] అలన్ టర్నర్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 328 పరుగులు చేయగా, శ్రీలంక 52 పరుగుల దూరంలో ఆగిపోయింది. జాన్ మాసన్ షార్ట్ బంతులు వేసి ఇద్దరు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను ఆసుపత్రికి పంపడంతో వాళ్లకు పెద్దగా అభిఉమానులు ఉండకపోవచ్చని ది డైలీ టెలిగ్రాఫ్ రాసింది.[12][13] గ్రూప్‌-ఎలో ఇంగ్లండ్‌, భారత్‌లు రెండు విజయాలు సాధించాయి. ట్రెంట్ బ్రిడ్జ్‌లో, కీత్ ఫ్లెచర్ ఇంగ్లండ్‌కు 131 పరుగులతో అత్యధిక స్కోరు సాధించి, ఇంగ్లీషు వారి రెండవ విజయానికి మార్గనిర్దేశం చేశాడు. న్యూజిలాండ్‌పై 80 పరుగుల విజయంతో గ్రూప్ పట్టికలో ఆధిక్యంలోకి వెళ్ళింది.[14] గ్రూప్ Aలోని ఇతర మ్యాచ్‌లో 720 మంది ప్రేక్షకుల మధ్య భారత్, ఈస్ట్ ఆఫ్రికాపై 10 వికెట్ల విజయాన్ని నమోదు చేసింది. మదన్ లాల్ భారతదేశం తరపున మూడు వికెట్లు పడగొట్టారు.[15]

నాలుగు రోజులు ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడైపోయిన మ్యాచ్‌లో, [16] గ్రూప్ Bలో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో చూసేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో తలపడింది. బంతి గాలిలో ఊపందుకోవడంతో, ఆస్ట్రేలియా ఐదు వికెట్లకు 61 పరుగులకు పడిపోయిన తర్వాత, రాడ్ మార్ష్, రాస్ ఎడ్వర్డ్స్ ల జోడీ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం సాధించి, ఆస్ట్రేలియాను 192 పరుగులకు నడిపించింది. ప్రతిస్పందనగా వెస్టిండీస్, ఆల్విన్ కాళీచరణ్ చేసిన 78 పరుగులతో ఏడు వికెట్ల విజయాన్ని అందుకుంది. ఇందులో డెన్నిస్ లిల్లీ 9 బంతుల్లో 31 పరుగులు సాధించారు. వెస్టిండీస్ గ్రూప్ Bలో అగ్రస్థానంలో నిలిచింది [17] జహీర్ అబ్బాస్, మాజిద్ ఖాన్, సాదిక్ మొహమ్మద్‌ల హాఫ్ సెంచరీలతో ట్రెంట్ బ్రిడ్జ్‌లో శ్రీలంకపై 192 పరుగుల తేడాతో వారి టోర్నమెంట్ విజయం సాధించి తమ టోర్నమెంటును ముగించింది.[18]

గ్రూప్ Aలో, గ్లెన్ టర్నర్ 114 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో[19] న్యూజిలాండ్ భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ-ఫైనల్‌కు చేరింది. గ్రూప్ Aలోని ఇతర మ్యాచ్‌లో ఇంగ్లండ్ తూర్పు ఆఫ్రికాపై 196 పరుగుల తేడాతో విజయం సాధించింది; జాన్ స్నో (అతని 12 ఓవర్లలో 11 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు) నేతృత్వంలోని బౌలింగ్ దాడికి ముందు డెన్నిస్ అమిస్, బారీ వుడ్ మధ్య 158 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించడంతో ఇంగ్లండ్, 60 ఓవర్లలో 290/5 స్కోర్ చేసింది. ఈస్ట్ ఆఫ్రికా 52.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. రమేష్ సేథీ మాత్రమే 32 ఓవర్ల వరకు కొంత ప్రతిఘటనను అందించాడు.[20]

గ్రూప్ ఎ

మరింత సమాచారం Pos, జట్టు ...
1975 జూన్ 7
స్కోరు
ఇంగ్లాండు 
334/4 (60 ఓవర్లు)
v
 భారతదేశం
132/3 (60 ఓవర్లు)
డెన్నిస్ అమిస్ 137 (147)
సయ్యద్ అబిద్ అలీ 2/58 (12 ఓవర్లు)
గుండప్ప విశ్వనాథ్ 37 (59)
పీటర్ లీవర్ 1/16 (10 ఓవర్లు)
ఇంగ్లాండ్ 202 పరుగులతో గెలిచింది
లార్డ్స్, లండన్
అంపైర్లు: డేవిడ్ కాన్‌స్టంట్ (ఇంగ్ల), జాన్ లాంగ్రిడ్జ్ (ఇంగ్ల)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డెన్నిస్ అమిస్ (ఇంగ్ల)

1975 జూన్ 7
స్కోరు
New Zealand 
309/5 (60 ఓవర్లు)
v
 తూర్పు ఆఫ్రికా
128/8 (60 ఓవర్లు)
గ్లెన్ టర్నర్ 171 (201)
పర్‌భు నానా 1/34 (12 ఓవర్లు)
ఫ్రసాత్ అలీi 45 (123)
డేల్ హాడ్లీ 3/21 (12 ఓవర్లు)
న్యూజీలాండ్ 181 పరుగులతో గెలిచింది
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
అంపైర్లు: డికీ బర్డ్ (ఇంగ్ల), ఆర్థర్ ఫాగ్ (ఇంగ్ల)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ టర్నర్ (న్యూజీ)

1975 జూన్ 11
స్కోరు
ఇంగ్లాండు 
266/6 (60 ఓవర్లు)
v
 New Zealand
186 (60 ఓవర్లు)
Keith Fletcher 131 (147)
Richard Collinge 2/43 (12 ఓవర్లు)
జాన్ మోరిసన్ 55 (85)
Tony Greig 4/45 (12 ఓవర్లు)
ఇంగ్లాండ్ 80 పరుగులతో గెలిచింది
Trent Bridge, Nottingham
అంపైర్లు: Bill Alley (Eng), టామ్‌ స్పెన్సర్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Keith Fletcher (Eng)

1975 జూన్ 11
స్కోరు
తూర్పు ఆఫ్రికా 
120 (55.3 ఓవర్లు)
v
 భారతదేశం
123/0 (29.5 ఓవర్లు)
Jawahir Shah 37 (84)
మదన్ లాల్ 3/15 (9.3 ఓవర్లు)
ఇండియా 10 వికెట్లతో గెలిచింది
హెడింగ్లీ, Leeds
అంపైర్లు: డికీ బర్డ్ (Eng), ఆర్థర్ జెప్సన్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Farokh Engineer (Ind)

1975 జూన్ 14
స్కోరు
ఇంగ్లాండు 
290/5 (60 ఓవర్లు)
v
 తూర్పు ఆఫ్రికా
94 (52.3 ఓవర్లు)
డెన్నిస్ అమిస్ 88 (116)
Zulfiqar Ali 3/63 (12 ఓవర్లు)
రమేష్ సేఠీ 30 (102)
జాన్ స్నో 4/11 (12 ఓవర్లు)
ఇంగ్లాండ్ 196 పరుగులతో గెలిచింది
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
అంపైర్లు: Bill Alley (Eng), జాన్ లాంగ్రిడ్జ్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జాన్ స్నో (Eng)

1975 జూన్ 14
స్కోరు
భారతదేశం 
230 (60 ఓవర్లు)
v
 New Zealand
233/6 (58.5 ఓవర్లు)
సయ్యద్ అబిద్ అలీ 70 (98)
Brian McKechnie 3/49 (12 ఓవర్లు)
న్యూజీలాండ్ 4 వికెట్లతో గెలిచింది
ఓల్డ్ ట్రాఫోర్డ్, Manchester
అంపైర్లు: లాయిడ్ బడ్ (Eng), Arthur Fagg (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ టర్నర్ (NZ)

గ్రూప్ బి

మరింత సమాచారం Pos, Team ...
1975 జూన్ 7
స్కోరు
ఆస్ట్రేలియా 
278/7 (60 ఓవర్లు)
v
 Pakistan
205 (53 ఓవర్లు)
Ross Edwards 80* (94)
Naseer Malik 2/37 (12 ఓవర్లు)
మాజిద్ ఖాన్ 65 (76)
డెన్నిస్ లిలీ 5/34 (12 ఓవర్లు)
ఆస్ట్రేలియా 73 పరుగులతో గెలిచింది
హెడింగ్లీ, Leeds
అంపైర్లు: Bill Alley (Eng), టామ్‌ స్పెన్సర్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డెన్నిస్ లిలీ (AUS)

1975 జూన్ 7
స్కోరు
శ్రీలంక 
86 (37.2 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
87/1 (20.4 ఓవర్లు)
సోమచంద్ర డి సిల్వ 21 (54)
బెర్నార్డ్ జూలియెన్ 2/16 (12 ఓవర్లు)
Roy Fredericks 33 (38)
సోమచంద్ర డి సిల్వ 1/33 (8 ఓవర్లు)
వెస్టిండీస్ 9 వికెట్లతో గెలిచింది
ఓల్డ్ ట్రాఫోర్డ్, Manchester
అంపైర్లు: లాయిడ్ బడ్ (Eng), ఆర్థర్ జెప్సన్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బెర్నార్డ్ జూలియెన్ (WI)

1975 జూన్ 11
స్కోరు
ఆస్ట్రేలియా 
328/5 (60 ఓవర్లు)
v
 శ్రీలంక
276/4 (60 ఓవర్లు)
అలన్ టర్నర్ 101 (113)
సోమచంద్ర డి సిల్వ 2/60 (12 ఓవర్లు)
ఆస్ట్రేలియా 52 పరుగులతో గెలిచింది
ది ఓవల్, లండన్
అంపైర్లు: లాయిడ్ బడ్ (Eng), Arthur Fagg (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలన్ టర్నర్ (AUS)

1975 జూన్ 11
స్కోరు
Pakistan 
266/7 (60 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
267/9 (59.4 ఓవర్లు)
మాజిద్ ఖాన్ 60 (108)
వివియన్ రిచర్డ్స్ 1/21 (4 ఓవర్లు)
వెస్టిండీస్ 1 వికెట్‌తో గెలిచింది
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
అంపైర్లు: డేవిడ్ కాన్‌స్టంట్ (Eng), జాన్ లాంగ్రిడ్జ్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సర్ఫరాజ్ నవాజ్ (Pak)

1975 జూన్ 14
స్కోరు
ఆస్ట్రేలియా 
192 (53.4 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
195/3 (46 ఓవర్లు)
Ross Edwards 58 (74)
ఆండీ రాబర్ట్స్ 3/39 (10.4 ఓవర్లు)
ఆల్విన్ కాళీచరణ్ 78 (83)
Ashley Mallett 1/35 (11 ఓవర్లు)
వెస్టిండీస్ 7 వికెట్లతో గెలిచింది
ది ఓవల్, లండన్
అంపైర్లు: డికీ బర్డ్ (Eng), డేవిడ్ కాన్‌స్టంట్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆల్విన్ కాళీచరణ్ (WI)

1975 జూన్ 14
స్కోరు
Pakistan 
330/6 (60 ఓవర్లు)
v
 శ్రీలంక
138 (50.1 ఓవర్లు)
జహీర్ అబ్బాస్ 97 (89)
Tony Opatha 2/67 (12 ఓవర్లు)
పాకిస్తాన్ 192 పరుగులతో గెలిచింది
Trent Bridge, Nottingham
అంపైర్లు: ఆర్థర్ జెప్సన్ (Eng), టామ్‌ స్పెన్సర్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జహీర్ అబ్బాస్ (Pak)
Remove ads

నాకౌట్ దశ

ప్రపంచ కప్ నాకౌట్ దశలో రెండు సింగిల్-ఎలిమినేషన్ రౌండ్‌ల నుండి ఫైనల్‌ జట్లు ఎంపికయ్యాయి వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే మ్యాచ్ ఆడేందుకు రెండు రిజర్వ్ డేలు ఉన్నాయి. [1]

సెమీ ఫైనల్స్

హెడింగ్లీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ జరిగింది. ఆస్ట్రేలియా జట్టులో, యాష్లే మల్లెట్ స్థానంలో గ్యారీ గిల్మర్‌ను తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ గెలవడంలో ఈ మార్పు కీలకంగా మారింది. మ్యాచ్ తర్వాత కెప్టెన్లిద్దరి చేతా విమర్శలకు గురైన పచ్చిక పిచ్ దీనికి కారణం. ఆస్ట్రేలియా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, గిల్మర్ తన 12 ఓవర్లు బౌలింగులో 14 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ ఏడు వికెట్లకు 37 పరుగుల స్కోరుకు పడీపోయింది. మైక్ డెన్నెస్ ఇంగ్లండ్‌ తరఫున పోరాడినప్పటికీ, అతనూ అఊటవడంతో ఇంగ్లండ్ 93 పరుగులకు ఆలౌటయింది. పరుగుల వేటలో, ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 39 పరుగులకు కుప్పకూలింది. గిల్మర్, డౌగ్ వాల్టర్స్‌తో జతకట్టి, మిగిలిన పరుగులను సాధించి ఆస్ట్రేలియాకు ఫైనల్‌లో స్థానం సంపాదించారు. [21]

ఓవల్‌లో వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భోజన విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత వారు 158 పరుగులకు కుప్పకూలారు. బెర్నార్డ్ జూలియన్ నాలుగు వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. [22] పరుగుల వేటలో, ఆల్విన్ కాళీచరణ్ (టాప్ స్కోరింగ్ 72), గోర్డాన్ గ్రీనిడ్జ్ (55 పరుగులు) మధ్య 125 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ఐదు వికెట్ల విజయానికి పునాది వేసింది. రిచర్డ్ కొలింగే మాత్రమే వెస్టిండీస్‌కు ఇబ్బంది కలిగించిన బౌలరు. అతని పన్నెండు ఓవర్లలో 28 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. [23]

1975 జూన్ 18
స్కోరు
ఇంగ్లాండు 
93 (36.2 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
94/6 (28.4 ఓవర్లు)
Mike Denness 27 (60)
Gary Gilmour 6/14 (12 ఓవర్లు)
Gary Gilmour 28* (28)
Chris Old 3/29 (7 ఓవర్లు)
Australia won by 4 wickets
Headingley, Leeds
అంపైర్లు: Bill Alley (Eng) and David Constant (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Gary Gilmour (Aus)

1975 జూన్ 18
స్కోరు
New Zealand 
158 (52.2 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
159/5 (40.1 ఓవర్లు)
Geoff Howarth 51 (93)
Bernard Julien 4/27 (12 ఓవర్లు)
Alvin Kallicharran 72 (92)
Richard Collinge 3/28 (12 ఓవర్లు)
వెస్టిండీస్ 5 వికెట్లతో గెలిచింది
The Oval, London
అంపైర్లు: Lloyd Budd (Eng) and Arthur Fagg (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Alvin Kallicharran (WI)

ఫైనల్

జూన్ 21న జరిగిన ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు మూడు రోజుల ముందే అమ్ముడుపోయాయి. [24] ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫేవరెట్‌. వెస్టిండీస్‌ను మొదట బ్యాటింగ్ చేయమని ఇయాన్ చాపెల్ కోరాడు. ఆ జట్టు 60 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్ తరపున 102 పరుగులు చేసాడు.[25] ఆస్ట్రేలియా బౌలర్లలో గ్యారీ గిల్మర్ 48 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రతిస్పందనగా, ఇయాన్ చాపెల్ హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు పునాదిని ఏర్పరచాడు. వివ్ రిచర్డ్స్ చేసిన మూడు రనౌట్‌లు ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెచ్చాయి. వారు తొమ్మిది వికెట్లకు 233 పరుగులకే కుప్పకూలారు. [25] డెన్నిస్ లిల్లీ, జెఫ్ థాంప్సన్‌ల చివరి వికెట్ భాగస్వామ్యంలో వచ్చిన 41 పరుగులు ఆస్ట్రేలియాను విజయానికి 18 పరుగుల దూరం లోకి చేర్చింది. కానీ ఇన్నింగ్స్‌లో జరిగిన ఐదవ రనౌట్‌తో ఆస్ట్రేలియా 274 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్‌ 17 పరుగుల తేడాతో గెలిచి, మొదటి పురుషుల ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. [26]

1975 జూన్ 21
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
291/8 (60 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
274 (58.4 ఓవర్లు)
క్లైవ్ లాయిడ్ 102 (85)
Gary Gilmour 5/48 (12 ఓవర్లు)
Ian Chappell 62 (93)
Keith Boyce 4/50 (12 ఓవర్లు)
వెస్టిండీస్ 17 పరుగులతో గెలిచింది
లార్డ్స్, లండన్
అంపైర్లు: Dickie Bird (Eng) and Tom Spencer (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Clive Lloyd (WI)

న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ టర్నర్, నాలుగు గేమ్‌లలో 333 పరుగులతో 1975 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరుగా నిలిచాడు. అతడు ఈస్ట్ ఆఫ్రికాపై టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరు 171* పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు డెన్నిస్‌ అమిస్‌, పాకిస్థాన్‌కు చెందిన మాజిద్‌ ఖాన్‌ మూడవ స్థానంలోనూ నిలిచారు. [27] ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్యారీ గిల్మర్ తన రెండు గేమ్‌లలో 11 వికెట్లతో టోర్నమెంట్‌లో ప్రముఖ వికెట్ టేకర్‌గా నిలిచాడు, సెమీ-ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై 14 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ టోర్నమెంట్ గణాంకాలు కూడా ఇందులో ఉన్నాయి. బెర్నార్డ్ జూలియన్, కీత్ బోయ్స్ (ఇద్దరూ వెస్టిండీస్‌కు చెందినవారు) టోర్నమెంట్‌లో 10 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచారు. [28]

Remove ads

గణాంకాలు

అత్యధిక పరుగులు

మరింత సమాచారం ఆటగాడు, జట్టు ...

అత్యధిక వికెట్లు

మరింత సమాచారం ఆటగాడు, జట్టు ...
Remove ads

గణాంకాలు

ఎంపిక చేసిన 8 మంది అంపైర్లలో 7 మంది ఇంగ్లాండ్‌కు చెందిన వారు కాగా, బిల్ అల్లీ ఆస్ట్రేలియా దేశానికి చెందినవాడు. మొదటి సెమీఫైనల్‌ను బిల్ అల్లీ, డేవిడ్ కాన్స్టాంట్ పర్యవేక్షించగా, లాయిడ్ బడ్, ఆర్థర్ ఫాగ్ రెండవ సెమీఫైనల్‌ను పర్యవేక్షించారు. తొలిసారిగా జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో ఫైనల్‌ పర్యవేక్షణకు డిక్కీ బర్డ్, టామ్ స్పెన్సర్ ఎంపికయ్యారు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads