1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

1983 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు From Wikipedia, the free encyclopedia

Remove ads

1983 నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాలలో 1983 జనవరిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదుపరి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. కొత్తగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో గెలిచి, భారీ మెజారిటీ సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెసు పార్టీ 60 సీట్లు మాత్రమే సాధించింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉండగా, జనవరి లోనే ఎన్నికలు జరిగాయి. 1983 జనవరి 9 న పది మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు డిప్యూటీ మంత్రులతో ఎన్టీరామారావు రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా, మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

త్వరిత వాస్తవాలు పార్టీ, Popular vote ...
Remove ads

ఎన్నికల విశేషాలు

రాష్ట్రంలో మొత్తం 3,18,46,694 మంది వోటర్లు ఉండగా, అందులో 2,15,60,642 (67.7%) మంది వోటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన వోట్లలో 2.06% వోట్లు చెల్లలేదు.

ఎన్నికలకు 9 నెలల ముందు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం 1,720 మంది పోటీ చెయ్యగా, వారిలో 1056 మంది ధరావతులు (డిపాజిట్లు) కోల్పోయారు. [1]

ఫలితాలు

రాష్ట్రంలో 294 శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో 39 ని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు, 15 నియోజక వర్గాలను షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకూ రిజర్వు చేసారు.

శాసనసభ నియోజకవర్గాలు, విజేతల జాబితా [1]

Thumb

మరింత సమాచారం s.No, పార్టీ ...

ఎన్నికైన శాసనసభ్యులు

మరింత సమాచారం నం., నియోజకవర్గం ...
Remove ads

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads