సెలీనియం

పరమాణు సంఖ్య 34 కలిగిన రసాయనిక మూలకం From Wikipedia, the free encyclopedia

సెలీనియం
Remove ads

సెలీనియం (Selenium) ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 34, రసాయన సంకేతము Se, పరమాణు భారము 78.96. ఇది ఒక nonmetal. దీని రసాయన గుణాలు సల్ఫర్, టెల్లూరియంలకు దగ్గరగా ఉంటాయి. ఇది ప్రకృతిలో మూలకం రూపంలో ఉండడం చాలా అరుదు.

త్వరిత వాస్తవాలు సెలీనియం, Pronunciation ...

ఎక్కువ పరిమాణంలో ఇది విషకరం. (toxic in large amounts). కాని చాలా కొద్ది మోతాదులలో మాత్రం అనేక ప్రాణుల జీవకణాల ప్రక్రియలకు అవసరం. గ్లూటాతియోన్ పెరాక్సిడేస్, తియోరిడాక్సిన్ రిడక్టేస్ అనే ఎంజైములలో కీలకమైన పదార్ధము (active center). ఈ ఎంజైములు కొన్ని జంతువులలోను, చెట్లలోను పరోక్షంగా ఆక్సిడైడ్ అయిన ఆణువులను reduce చేయడానికి సహకరిస్తాయి. ఇంకా మూడు డి-అయొడినేస్ ఎంజైములలో కూడా ఇది భాగం. ఈ మూడు డి-అయొడినేస్ ఎంజైములు థైరాయిడ్ హార్మోనుల (thyroid hormone) ను మార్చడానికి ఉపయోగ పడతాయి. కొన్ని వృక్షజాతులలో మాత్రమే సెలీనియం పదార్ధాల అవసరం ఉన్నట్లున్నది.[6]

విడిగా సెలీనియం వివిధ రూపాలలో ఉంటుంది. సాధారణమైనది dense purplish-gray semi-metal (సెమి కండక్టర్). దీని నిర్మాణం ఒక trigonal polymer chain. ఇది చీకటిలో కంటే వెలుతురులో విద్యుత్తును బాగా ప్రసరింపజేస్తుంది. కనుక ఫొటో సెల్స్లో దీనిని వాడుతారు.

సెలీనియం సాధారణంగా పైరైట్ వంటి సల్ఫైడ్ ఖనిజాలలో లభిస్తుంది.

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads