గాంధీనగరం (నూజెండ్ల)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండల గ్రామం. From Wikipedia, the free encyclopedia

Remove ads

గాంధీనగరం, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన గ్రామం.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.541416°N 79.841858°E /, రాష్ట్రం ...
Remove ads

గ్రామ విశేషాలు

  • ఈ గ్రామంలో పాలు ఉత్పత్తి చేయని ఇల్లు లేదు. ఈ గ్రామానికి పాలవుత్పత్తిలో జిల్లాలోనే ప్రథమస్థానం. సాంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ, గేదె పేడతో గోబర్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేసుకుంటూ, గ్యాస్‌ ఆదా చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికీ, బయోగ్యాసుప్లాంటు ఏర్పాటు చేసుకున్నారు. కాలుష్యరహిత గ్రామంగా, పొగలేని గ్రామంగా గుర్తింపు సాధించారు. నెడ్‌ క్యాప్‌ మన్ననలు పొందారు. 294 ఇళ్ళు ఉన్న ఈ గ్రామానికి జాతీయస్థాయిలోనే గుర్తింపు ఉంది.
  • ఈ గ్రామంలో దశాబ్దాలుగా మహిళలూ, గ్రామపెద్దలూ ప్రధానపాత్ర పోషించుచూ, మద్యనిషేధం అమలు చేస్తున్నారు. తండ్రి తాగి రోడ్డున పడితే, పిల్లలూ అదే బాటలో నడిచారు. పిల్లలు పాడైపోతున్నారని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు హెచ్చరించడంతో, మహిళలలో ఆవేశం రగిలి, అందరూ ఏకమై వీధికెక్కారు. బెల్టు షాపులను మూయించారు. గ్రామంలో మద్యం సరఫరా చేయడానికి వీలులేదని అడ్డం తిరిగినారు. దీనికి పెద్దలు దిగి వచ్చారు. వీధులవారీగా సభ్యులను చేర్చి, ఒక కమిటీ ఏర్పాటుచేశారు. అప్పటి నుండి మద్యనిషేధాన్ని చక్కగా అమలు చేస్తున్నారు. గుడివద్ద ఒప్పందపత్రాలు వ్రాసుకున్నారు. కట్టుబాటు తప్పితే రు.పదివేలు జరిమానా విధించుతారు.
Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads