అటల్ బిహారీ వాజపేయి
భారతదేశపు 10వ ప్రధాన మంత్రి, భారరత్న పురస్కార గ్రహీత / From Wikipedia, the free encyclopedia
అటల్ బిహారీ వాజపేయి (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్‌లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.[1] ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.[2] 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళారు[3]
అటల్ బిహారీ వాజపేయి अटल बिहारी वाजपेयी | |
11వ భారత ప్రధానమంత్రి (1వ దఫా) | |
పదవిలో 16 మే 1996 – 1 జూన్ 1996 | |
మునుపు | పాములపర్తి వెంకట నరసింహారావు |
---|---|
తరువాత | హెచ్.డి.దేవెగౌడ |
14వ భారత ప్రధానమంత్రి (2వ దఫా) | |
పదవిలో 19 మార్చి 1998 – 22 మే 2004 | |
మునుపు | ఐ.కె.గుజ్రాల్ |
తరువాత | డా.మన్మోహన్ సింగ్ |
జననం | (1924-12-25)1924 డిసెంబరు 25 బటేశ్వర్, ఆగ్రా జిల్లా, ఉత్తర ప్రదేశ్, బ్రిటీష్ ఇండియా |
మరణం | 2018 ఆగస్టు 16(2018-08-16) (వయసు 93) ఢిల్లీ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
వృత్తి | రాజకీయ నాయకుడు, కవి |
మతం | హిందూమతము |
సంతకం | |
వెబ్సైటు | http://www.atalbiharivajpayee.in |