From Wikipedia, the free encyclopedia
అన్నవాహిక, ఆహారవాహిక, అన్ననాళం, ఆహారనాళం ఒక కండరాలతో చేయబడిన నాళము. ఇది ఆహారాన్ని గొంతు నుండి జీర్ణకోశానికి చేర్చుతుంది. ఇది ఇంచుమించు 25 సెం.మీ. పొడవుంటుంది. దీని చివరిభాగం ఉదరంలో ఉంటుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అన్నవాహిక | |
---|---|
Head and neck. | |
Digestive organs. (Esophagus is #1) | |
లాటిన్ | œsophagus |
గ్రే'స్ | subject #245 1144 |
ధమని | esophageal arteries |
సిర | esophageal veins |
నాడి | celiac ganglia, vagus[1] |
Precursor | Foregut |
MeSH | Esophagus |
Dorlands/Elsevier | e_16/12343479 |
అన్నవాహికలోని ముఖ్యమైన భాగాలు:[2]
అన్నవాహిక మానవుని జీర్ణవ్యవస్థలోని మొట్టమొదటి భాగము. మనం భుజించిన ఆహారం నోటిలో నుండి క్రిందికి జారి మ్రింగుట ద్వారా ఫారింక్స్ లోనికి ఆ తర్వాత అన్నవాహికలోనికి ప్రవేశిస్తుంది. అన్నవాహిక ద్వారా కదలిన ఆహారం జీర్ణకోశం చేరుతుంది.[3] మనం ఆహారాన్ని మ్రింగినప్పుడు ఎపిగ్లాటిస్ వెనుకకు గొంతును కప్పివుంచుతుంది. అందువలన ఆహారం శ్వాసమార్గాలలోకి ప్రవేశించకుండా నిరోధించబడుతుంది. అదే సమయంలో అన్నవాహిక ముందుభాగంలోని కండరాలు వ్యాకోచించి, ఆహారం అందులోనికి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అన్నవాహిక కండరాల సంకోచ వ్యాకోచాల మూలంగా ఆహారం క్రమంగా క్రిందికి కదలుతుంది. ఆ సమయంలోనే అన్నవాహిక క్రిందభాగంలోని కండరాలు వ్యాకోచించి ఆహారం అన్నకోశంలోని ప్రవేశించడానికి తోడ్పడుతుంది.[3]
జీర్ణకోశం చాలా గాఢమైన ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణకోశపు స్రావాలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు, పొటాషియం క్లోరైడు, సోడియం క్లోరైడు లవణాలు ఆహారం జీర్ణం కావడానికి ఉపకరిస్తాయి. అన్నవాహిక క్రింది భాగంలోని కండరాలు సంకోచించడం వలన ఈ జీర్ణకోశ స్రావాలు వెనుకకు తిరిగి ప్రవేశించకుండా నిరోధించబడతాయి. ఇదే కాకుండా ఆ ప్రాంతంలోని లఘుకోణం, డయాఫ్రం కండరాలు కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తాయి.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.