ఇండో-యూరోపియన్ భాషలు
ఇండో యూరోపియను భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందిన భాషలు. / From Wikipedia, the free encyclopedia
ఇండో యూరోపియను భాషలు లేక సింధ ఐరోపా భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందిన భాషలు. ఇవి చాలా కాలం క్రితం ఉండిన ఒకే మూలభాషనుండి వచ్చాయని భాషావేత్తల అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచ భాషలలో ఇండో యూరోపియను భాషలు ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నాయి. ఐరోపా, ఆసియా, అమెరికా ఖండాలలోని ప్రస్తుత భాషలలోని అన్ని ముఖ్యమైన భాషలన్నీఈ ఇండో యూరోపియను భాషా కుటుంబమునకు చెందినవే. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రముఖ ఐదు భాషలలో చైనీసు కాకుండా మిగిలిన నాలుగు భాషలూ ఈ కుటుంబానికి చెందినవి. ప్రస్తుతం ప్రపంచంలోని భాషలలో బెంగాలీ, ఇంగ్లీషు, ఫ్రెంచి, హిందీ, జర్మను, పోర్చుగీసు, రష్యను, స్పానిషు, వంటి అన్ని భాషలూ ఈ కుటుంబమునకు చెందినవి. ఇవే కాకుండా ఎన్నో చిన్న చిన్న భాషలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచములోని భాషాకుటుంబాలలో ఈ కుటుంబంలోని భాషలు అతి పెద్ద స్థానం కలిగి ఉన్నాయి. రెండవ అతి పెద్ద భాషా కుటుంబము చైనో-టిబెటిన్ భాషా కుటుంబము.