కార్బన్-14
From Wikipedia, the free encyclopedia
కార్బన్-14, 14C, లేదా రేడియోకార్బన్, కార్బన్ యొక్క రేడియోధార్మిక ఐసోటోపు. దీని పరమాణు కేంద్రకంలో 5 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లూ ఉంటాయి. సేంద్రియ పదార్థాలలో దీని లభ్యత దాని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతిపై ఆధారంగా ఉంటుంది. రేడియో డేటింగ్, శిలాజాల వయస్సును కనుగొనే పద్ధతి. దీనిని విల్లియర్డ్ లిబ్బీ, అతని సహచరులూ 1949లో కనుగొన్నారు. కార్బన్ - 14 ను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని రేడియేషన్ లాబొరేటరీకి చెందిన మార్టిన్, సామ్ రూబెన్ లు 1940, ఫిబ్రవరి 27 న కనుగొన్నారు. దీని ఉనికిని 1934లో ప్రాంజ్ కురీ తెలియజేసాడు.[2]
కార్బన్-14
Full table | |
---|---|
సాధారణ అంశాలు | |
పేరు, సంకేతం | రేడియో కార్బన్,14C |
న్యూట్రాన్లు | 8 |
ప్రోటాన్లు | 6 |
కేంద్రక సమాచారం | |
సహజ లభ్యత | 1 ట్రిలియన్ కు ఒక భాగం |
అర్థ జీవితకాలం | 5,730 ± 40 సంవత్సరాలు |
ఐసోటోపు ద్రవ్యరాశి | 14.003241 u |
స్పిన్ | 0+ |
విఘటన క్రమం | విఘటన శక్తి |
బీటా | 0.156476[1] MeV |
భూమిపై కార్బన్ సాధారణంగా మూడు రకాల ఐసోటోపులలో లభ్యమవుతుంది: లభ్యమయ్యే మొత్తం కార్బన్లో "కార్బన్-12" రూపం 99%, "కార్బన్-13" రూపం 1% ఉండగా, చాలా తక్కువ పరిమాణంలో కార్బన్-14 శిథిలావశేషాలలో (వాతావరణంలోని కార్బన్లో 1012 అణువులలో 1 లేదా 1.5 అణువులు మాత్రం) ఉంటుంది. కార్బన్-12, కార్బన్-13లు స్థిరమైనవి. కార్బన్ - 14 అర్థ జీవిత కాలం 5730±40 సంవత్సరాలు ఉంటుంది.[3] కార్బన్-14 బీటా విఘటనం చెందడం వలన నైట్రోజన్ - 14 ఏర్పడుతుంది.[4] ఒక గ్రాము కార్బన్ లో 1012 అణువులకు ఒక అణువు కార్బన్-14 సెకనుకు ~0.2[5] బీటా కణాలను ఉద్గారించగలదు. భూవాతావరణంలో కాశ్మిక్ కిరణాలు నైట్రోజన్ వాయువుతో చర్య జరపడం వలన కార్బన్-14 ఐసోటోపు ఏర్పడుతుంది. ఇది భూమిపై లభ్యమయ్యే కార్బన్-14 యొక్క ప్రాథమిక సహజ వనరు.
కార్బన్ యొక్క వేర్వేరు ఐసోటోపులు వాటి రసాయనిక లక్షణాల్లో భిన్నంగా ఉండవు. రసాయన, జీవశాస్త్ర పరిశోధన, కార్బన్ లేబెలింగ్ అని పిలువబడే పద్ధతిలో ఈ ఐసోటోపుల పోలికను ఉపయోగిస్తారు.