జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)
భారతీయ చిత్ర దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (జనవరి 14, 1951 - జూన్ 19,2001 ) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం
జంధ్యాల పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం జంధ్యాల (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి, జననం ...
జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి | |
---|---|
![]() జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి | |
జననం | జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి జనవరి 14 , 1951 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం |
మరణం | జూన్ 19 ,2001 హైదరాబాదు |
మరణ కారణం | గుండె పోటు |
ఇతర పేర్లు | జంధ్యాల |
ప్రసిద్ధి | తెలుగు సినిమా రచయిత, దర్శకుడు |
మూసివేయి