From Wikipedia, the free encyclopedia
1960, డిసెంబర్ 29న జన్మించిన డేవిడ్ బూన్ (David Boon) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980, 1990 దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో, 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో టాస్మేనియా తరఫున ఆడుతూ 1978-79లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ క్లారెన్స్ బూన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా | 1960 డిసెంబరు 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్ మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 325) | 1984 నవంబరు 23 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1996 జనవరి 29 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 80) | 1984 ఫిబ్రవరి 12 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1995 మార్చి 15 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1978–1999 | టాస్మానియా టైగర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997–1999 | Durham | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రిక్ ఇన్ఫో, 2009 డిసెంబరు 9 |
డేవిడ్ బూన్ 107 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 43.65 సగటుతో 7422 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు, 32 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతడి అత్యధిక స్కోరు సరిగ్గా 200 పరుగులు.
బూన్ 181 వన్డేలు ఆడి 37.04 సగటుతో 5946 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 122 పరుగులు.
డేవిడ్ బూన్ ఆస్ట్రేలియా విజయం సాధించిన 1987 ప్రపంచ కప్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు. భారత ఉపఖండంలో జరిగిన ఆ టోర్నమెంటులో 55.87 సగటుతో 447 పరుగులు సాధించాడు. లాహోర్‌లో జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్ పై 65 పరుగులు సాధించాడు. కోల్‌కతలో జరిగిన ఫైనల్లో 75 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[2] 1987 ప్రపంచకప్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డేవిడ్ బూన్. ఆస్ట్రేలియా విజయంలో డేవిడ్ బూన్దే కీలకపాత్ర. పాకిస్థాన్‌తో సెమీస్‌లో 65 పరుగులు చేసిన బూన్ ఫైనల్లో 75 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీలో అతను 8 మ్యాచ్‌ల్లో 447 పరుగులు చేశాడు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.