పిన్కోడ్
భారతదేశంలో వాడే పోస్ట్ కోడ్ పద్ధతి / From Wikipedia, the free encyclopedia
పిన్కోడ్ (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానం భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడింది.దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్ నెంబర్ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్కోడ్లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.