బకింగ్‌హాం కాలువ
ఆంధ్ర తీరం వెంట తమిళనాడు వరకు సాగే నావికా యోగ్యమైన ఉప్పునీటి కాలువ / From Wikipedia, the free encyclopedia
బకింగ్‌హాం కాలువ, దక్షిణ భారతదేశం లోని కోరమాండల్ తీరం వెంట ప్రయాణించే నావికా యోగ్యమైన ఉప్పునీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉంది. చెన్నై దగ్గర, ఈ కాలువ తో అనుసంధానమైన ఉన్న సహజ సిద్ధమైన సముద్రపు కాలువ ద్వారా మద్రాసు నౌకాశ్రయముతో కలుపుతుంది. ఆంగ్లేయులు కట్టించిన ఈ కాలువ బ్రిటిషు పాలనా కాలములో ప్రధాన జలరవాణా మార్గముగా అభివృద్ధి చెందింది.