భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా / From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది.
భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది. అయితే పుదుచ్చేరి, జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలు అయినప్పటికీ వాటికి స్వంత ప్రభుత్వాలు ఉన్నాయి. స్వంత ప్రభుత్వం కలిగిన ఢిల్లీ మాత్రం అటు రాష్ట్రం కాక, ఇటు కేంద్ర పాలిత ప్రాంతం కాక మధ్యస్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ కి ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.