మస్కట్
ఒమన్ రాజధాని మరియు అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
మస్కట్ (Muscat) ఒమన్ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. 2005 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా సుమారు ఆరు లక్షలు.. ఇది మధ్యప్రాచ్యంలోని పురాతన నగరాలలో ఒకటి. ఒక ప్రక్క అరేబియా సముద్రం, మరోప్రక్క పర్వత శ్రేణుల మధ్య మస్కట్ నగరం తీరం వెంబడి విస్తరించి ఉంది. కనుక నగరంలో అధిక భాగం పర్వతాలే. ఒమన్ అధికంగా ఎడారి ప్రాంతపు దేశం. సహజమైన నీటి వనరులు గాని, సారవంతమైన నేల గాని లేని మస్కట్ నగరం ప్రభుత్వం, ప్రజల కృషి కారణంగా పచ్చగా కనిపిస్తుంది. పరిశుభ్రతకు, పచ్చదనానికి, ఇస్లామిక్ నిర్మాణ శైలికి నగరంలో అత్యంత ప్రాధాన్యత ఉంది.
| |||
వర్గీకరణ | నగరం | ||
సుల్తాన్ | సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ అల్ సైద్ | ||
వైశాల్యం | 3,500 చ.కి.మీ. | ||
జనాభా - Total (2005) - జనసాంద్రత - లెక్కించబడిన ర్యాంకు |
606,024 184.57/చ.కి.మీ. 1st | ||
టైమ్ జోన్: | (UTC) +4 | ||
అక్షాంశం రేఖాంశం |
23.61°N 58.54°E / 23.61; 58.54 | ||
వెబ్ సైటు: https://web.archive.org/web/20071010124752/http://www.omanet.om/ | |||