From Wikipedia, the free encyclopedia
మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.దీని ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షంగా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి.[1]
మామిడి (మ్యాంగో) | |
---|---|
చెట్టుపై పచ్చిగా ఉన్న మామిడి కాయలు | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | మాంగిఫెరా |
జాతులు | |
సుమారు 35 రకాలు - వీడియో వీక్షించండి |
దేశం | హెక్టేరులు |
---|---|
భారతదేశం | 1,600,000 |
చైనా | 433,600 |
థాయిలాండ్ | 285,000 |
ఇండొనీషియా | 273,440 |
మెక్సికో | 173,837 |
ఫిలిప్పీన్స్ | 160,000 |
పాకిస్తాన్ | 151,500 |
నైజీరియా | 125,000 |
గునియా | 82,000 |
బ్రెజిల్ | 68,000 |
వియత్నాం | 53,000 |
బంగ్లాదేశ్ | 51,000 |
ప్రపంచం మొత్తం | 3,870,200 |
వనరు: యు.ఎన్. ఆహారం , వ్యవసాయ సంస్థ. (FAO) Archived 2006-06-19 at the Wayback Machine |
మొఘల్ చక్రవర్తి బాబర్ తన ఆత్మకధ బాబర్ నామా లో ఎంతో ప్రశంసించిన పండు మామిడి పండు ఉ ష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై (30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (10) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూల గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరువాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.
పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలే వైపు కొంచెం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి. ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. ఏడు (7) నుండి (12) సెంటి మీటర్ల వ్యాసం, పది (10) నుండి ఇరవై ఐదు (25) సెంటి మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మధ్యలో పీచు తోను, పీచు లేకుండాను దృఢమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి (1) నుండి (2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్న విత్తనంతో (జీడి) ఉంటుంది. విత్తనం నాలుగు (4) నుండి ఏడు (7) సెంటి మీటర్ల పొడవు, మూడు (3) నుండి నాలుగు (4) సెంటి మీటర్ల వెడల్పు, ఒక (1) సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 272 కి.J (65 kcal) |
17.00 గ్రా. | |
చక్కెరలు | 14.8 గ్రా. |
పీచు పదార్థం | 1.8 గ్రా. |
0.27 గ్రా. | |
.51 గ్రా. | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ beta-Carotene | 5% 38 μg4% 445 μg |
థయామిన్ (B1) | 5% 0.058 mg |
రైబోఫ్లావిన్ (B2) | 5% 0.057 mg |
నియాసిన్ (B3) | 4% 0.584 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 3% 0.160 mg |
విటమిన్ బి6 | 10% 0.134 mg |
ఫోలేట్ (B9) | 4% 14 μg |
విటమిన్ సి | 33% 27.7 mg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 1% 10 mg |
ఇనుము | 1% 0.13 mg |
మెగ్నీషియం | 3% 9 mg |
ఫాస్ఫరస్ | 2% 11 mg |
పొటాషియం | 3% 156 mg |
జింక్ | 0% 0.04 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య, దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) చక్కెర, ఒక శాతం (1%) మాంసకృత్తులు, గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు (ఊరగాయ లు) తయారు చేస్తారు.
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటలలో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పైతో చేస్తున్నారు. థాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్) తో చేర్చి అందిస్తారు.
మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.
చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగు పడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపు చేయటానికీ తోడ్పడు తున్నట్టూ బయటపడింది.
రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి అని అధ్యయన నేత డాక్టర్ లూకాస్ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్ రొమ్ముల్లోని క్యాన్సర్, క్యాన్సర్ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయట పడింది
భారతదేశంలో మామిడి తాండ్రను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు,,, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ పండ్ల రసాల అంగడిలో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీంలో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు. మామిడి పళ్లను మాగ పెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తారు. రైతుల ఆతృత, వ్యాపారుల లాభాపేక్ష వెరసి మామిడి పండ్ల అసలు రంగు, రుచిని పోగొడుతున్నాయి. సరైన రీతిలో పండకుండా కృత్తిమ మార్గాల్లో విష ప్రయోగాలు చేస్తున్నారు.
కచ్చితంగా ప్రారంభం ఎక్కడో ఎవరికీ తెలియక పోయినా శిలాజాల ఆధారంగా ఇరవైఐదు (25) నుండి (30) మిలియన్ సంవత్సరాల పూర్వం మామిడి ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. పురాణాలలో, వేదకాలంలో ఉన్నట్లు వర్ణనలు ఉన్నాయి. ఇండియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్ మామిడి చెట్టు జన్మ స్థలంగా విశ్వసించ బడుతోంది.
భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణం తోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
తమిళంలోని మాంగాయ్, లేక మలయాళంలోని మాంగా అనే పేరు. పోర్చుగీసులు ఇండియాకు వచ్చిన తరువాత పోర్చుగీసుల వలన వ్యాపించినదని గుర్తించారు. పొర్చుగీసు వాళ్లు దీనిని మాంగా పిలవడం దీనికి కారణం.
There are many species of mango, including:
|
ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయించడం ఒక మామిడి చెట్టుకే సాధ్యం. ఇంటి లోని పెరడులో పెంచే చెట్టుకు ఈ విధంగా ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయిస్తే అన్ని రకాలాను తిన్నట్టు ఉంటుంది. "ట్రీ టాప్ గ్రాఫ్టింగ్" ద్వారా ఇది సాధ్యం. బాగా ఎదిగిన పెద్ద మామిడి చెట్టుకున్న పెద్ద కొమ్మలను కొట్టి వేయాలి. మూడు నెలలకు, కొట్టిన ప్రతి కొమ్మకు కొన్ని చిగుర్లు వస్తాయి. అవి చేతి వేలు ప్రమాణం వచ్చి నపుడు వాటిని సన్నటి పదునైన చాకుతో ఏట వాలుగా కోయాలి. మనకు కావలసిన అనేక రకాల మామిడి రకాల చెట్టు కొమ్మల నుండి చేతి వేలి లావున్న కొమ్మలను ఏటవాలుగా కోసి ( నాలుగు అంగుళాల పొడవు) ఈ చెట్టుకు కోసిన కొమ్మలకు అతికించి గట్టిగా కట్టాలి. ఆవిధంగా అన్నికొమ్మలకు కావలసిన రకాల కొమ్మలను అతికించి కట్టాలి. కొంత కాలానికి కొత్తగా అతికించిన కొమ్మ చిగుర్లు వేసి పెద్దదై దానికి సంబంధించిన కాయలను కాస్తుంది. ఎన్ని రకాల కొమ్మలను అతికించామో అన్ని రకాల కాయలు కాస్తుంది. ప్రతి ఏడు ఇలా కావలసిన రకాల కొమ్మలను అంటు కట్టి రకరకాల కాయలను కాయించ వచ్చు.
అంపిలేపి (కొండ మామిడి) చెట్టు దాదాపు 27 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్టు బెరడు, కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.