ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం, భారత దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. భారత మాజీ ప్రధాని కీ.శే. రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92 లో ఈ పురస్కారం ప్రారంభింపబడింది. ఒక ప్రశంసాపత్రం, ఒక పతకం, నగదు ఈ పురస్కారం లోని భాగాలు.

త్వరిత వాస్తవాలు పురస్కారం గురించి ...
ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న
Thumb
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం ఫౌర
విభాగం క్రీడా పురస్కారం వ్యక్తిగతం లేదా జట్టుకు
వ్యవస్థాపిత 1991–1992
మొదటి బహూకరణ 1991–1992
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి 750,000
వివరణ భారతదేశంలో అత్యధిక క్రీడా గౌరవం
మొదటి గ్రహీత(లు) విశ్వనాథన్ ఆనంద్
క్రితం గ్రహీత(లు) యోగేశ్వర్ దత్, Vijay Kumar
Award Rank
none ← ధ్యాన్ చంద్ ఖేల్‌రత్నఅర్జున అవార్డు
మూసివేయి

ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్‌వెల్త్ క్రీడల్లో గాని, బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్, చదరంగం వంటి క్రీడల్లో గానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారునికి లేక జట్టుకు ఈ పురస్కారం ఇస్తారు. సాధారణంగా, పురస్కారం ప్రకటించేందుకు ఒక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు కనబరచిన ప్రదర్శనలను లెక్కిస్తారు. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పురస్కార విజేతను నిర్ణయించేందుకు క్రీడలతో సంబంధమున్న వారితో కూడిన ఒక బృందాన్ని నియమిస్తుంది. ఏదైనా సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధంగా లేవని ఎంపిక బృందం భావిస్తే ఆ ఏటికి పురస్కార ప్రధానం జరగదు.

ఖేల్ రత్న పురస్కారం 1991 నుండి 2021 వరకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరిట రాజీవ్ గాంధీ చంద్ ఖేల్‌రత్న పురస్కారం అని ఉండేది. 2021 ఆగస్టు 6 న దీని పేరును ప్రముఖ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పేరిట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం అని మార్చారు.

ఇప్పటివరకు ఈ పురస్కారం వేరు వేరు విభాగాలకు చెందిన ఇద్దరేసి క్రీడాకారులకు సంయుక్తంగా రెండు సార్లు ప్రధానం చేయగా, 1993-94 లో మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్క మారు మాత్రమే క్రీడా జట్టుకు పురస్కారం లభించింది. ఈ పురస్కారంలో నగదు బహుమతి 1991-92 లో లక్ష రూపాయిలు, 2000-01 లో మూడు లక్షల రూపాయిలు, 2004-05 నాటికి అయిదు లక్షల రూపాయిలు ఉంది.

అర్జున పురస్కారానికీ, ఈ పురస్కారానికి మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమనగా - అర్జున పురస్కారాన్ని ప్రతి క్రీడలోని ఉత్తమ క్రీడాకారునికి ఇస్తారు. కానీ ఈ పురస్కారం మాత్రం క్రీడాకారులందరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే ఇస్తారు. ఖేల్ రత్న అను హిందీ పదానికి క్రీడారత్నమని అర్థం.

పురస్కార విజేతలు

మరింత సమాచారం క్రమ సంఖ్య, సంవత్సరం ...
క్రమ సంఖ్య సంవత్సరం క్రీడాకారుని (ల) పేరు/పేర్లు క్రీడావిభాగం
01 1991-92 విశ్వనాథన్ ఆనంద్ చదరంగం
02 1992-93 గీత్ సేథి బిలియర్డ్స్
03 1993-94 పురస్కార ప్రధానం జరుగలేదు -
04 1994-95 హోమీ మోతీవాలా, పి. కె. గర్గ్ యాటింగ్ (టీం క్రీడ)
05 1995-96 కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్
06 1996-97 లియాండర్ పేస్, కుంజరాణి (సహవిజేతలు) టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్
07 1997-98 సచిన్ టెండుల్కర్ క్రికెట్
08 1998-99 జ్యోతిర్మయి సిక్దర్ ఆథ్లెటిక్స్
09 1999-2000 ధన్‌రాజ్ పిళ్ళై హాకీ
10 2000-01 పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్
11 2001-02 అభినవ్ భింద్ర షూటింగ్
12 2002-03 అంజలి వేద్ పాథక్ భగవత్, బీనామోల్ (సహవిజేతలు) షూటింగ్, ఆథ్లెటిక్స్
13 2003-04 అంజు బాబి జార్జ్ ఆథ్లెటిక్స్
14 2004-05 రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ షూటింగ్
15 2005-06 పంకజ్ అద్వానీ బిలియర్డ్స్ & స్నూకర్స్
16 2006-07 మనవ్జీత్ సింగ్ సంధు షూటింగ్
17 2007-08 మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్
18 2011-12 విజయ్ కుమార్ (shooting) yogshwar dutt (wresting)
మూసివేయి

2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం మొత్తం ఐదుగురికి ఇచ్చారు

  • రోహిత్ శర్మకు క్రికెట్
  • వినేశ్ ఫోగట్ మహిళల రెజ్లింగ్
  • రాణి రాంఫల్ హాకీ
  • మనికభత్ర. టేబుల్ టెన్నిస్
  • మరియప్పన్ తంగావెలు
  • పార అథ్లెట్

మూలాలు

ఇతర లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.