![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/86/RudrakshaTree.jpg/640px-RudrakshaTree.jpg&w=640&q=50)
రుద్రాక్ష
From Wikipedia, the free encyclopedia
రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.
త్వరిత వాస్తవాలు రుద్రాక్ష చెట్టు, శాస్త్రీయ వర్గీకరణ ...
రుద్రాక్ష చెట్టు | |
---|---|
![]() | |
రిషికేశ్ లోని రుద్రాక్ష చెట్టు | |
![]() | |
చెట్టుకు కాసిన రుద్రాక్ష కాయ | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Oxalidales |
Family: | Elaeocarpaceae |
Genus: | Elaeocarpus |
Species: | E. ganitrus |
Binomial name | |
Elaeocarpus ganitrus (Roxb.) | |
మూసివేయి