వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
From Wikipedia, the free encyclopedia
వికీపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. అనేక భాషల్లో వికీపీడియా నిర్మితమౌతోంది. తెలుగు వికీపీడియాను ముద్దుగా తెవికీ అని కూడా అంటారు. వికీపీడియా మనందరిదీ. ఇక్కడ ఎవరైనా వ్రాయవచ్చు, ఇతరులు వ్రాసినవి సరిదిద్దవచ్చు. అలాగే మీరు వ్రాసినవి ఇతరులు సరిదిద్దుతారు. ఇక్కడ అందరూ సమానమే! సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అయితే నిర్వహణా పరమైన కొన్ని పనులు చేసేందుకు గాను, కొందరు నిర్వాహకులు ఉంటారు. అనుభవశాలురైన సభ్యులే నిర్వాహకులుగా నియమితులవుతారు. వీరిని ఎన్నుకునేది కూడా తోటి సభ్యులే! వికీపీడియాలోని ముఖ్యాంశాల గురించి మీరీ పేజీలో చూడవచ్చు.
అడ్డదారి: WP:5 WP:5MIN |
---|
![]() | ఈ సమాచారం తెవికీ తొలినాళ్లలో అనగా 2007సంవత్సరంలో గల వ్యవస్థ గురించి తెలియచేసేవిధంగా వ్రాయబడింది. ప్రస్తుత రూపంతో కొంతమేర మార్పులుంటాయి. తాజా సమాచారం కొరకు సహాయం:వికీపీడియా పరిచయం చూడండి. |
త్వరిత వాస్తవాలు
ఈ ఆడియో ఫైలు ఈ వ్యాసము యొక్క 2007-06-06 నాటి సంచిక నుండి సృష్టించబడినది. కావున ఇది ఆ తరువాత ఈ వ్యాసంలో జరిగిన మార్పులను ప్రతిబింబించదు. (ఆడియో సహాయం)
మూసివేయి