వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు
From Wikipedia, the free encyclopedia
వికీపీడియా ఒక సామూహికంగా చేపట్టిన ప్రాజెక్టు. దాని వ్యవస్థాపకులకూ, సమర్పకులకు ఉన్న ఒకే ఒక లక్ష్యం:
- విశ్వసనీయమైన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చెయ్యడమే— విస్తృతి లోను, లోతు లోను అత్యంత పెద్దదైన సర్వస్వం.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వికీపీడియా కు కొన్ని విధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. కొన్ని విధానాలు ఇంకా రూపు దిద్దుకొంటుండగా, కొన్ని ఇప్పటికే తయారయి నిర్వివాదంగా పని చేస్తున్నాయి.
విధానాలు ఒక పక్కన రూపు దిద్దుకొంటుండగా, అన్ని రకాల దుశ్చర్యలను అరికట్టడానికి ఈ నియమాలు సరిపోవని కొందరు వికీపీడియనులు భావిస్తున్నారు. ఉదాహరణకు, వికీపీడియా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని - వారు నియమాలను అతిక్రమించక పోయినా - మందలించవచ్చు. సద్బుద్ధితో దిద్దుబాట్లు చేసే వారికి, మర్యాద గా ఉండేవారికి, ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నించే వారికి, నిష్పాక్షికమైన సర్వస్వాన్ని తయారు చెయ్యడానికి ప్రయత్నించే వారికి, అనుకూల వాతావరణం ఉండాలి.