శివాలిక్ కొండలు
From Wikipedia, the free encyclopedia
శివాలిక్ కొండలు సింధు నది నుండి దాదాపు 2,400 km (1,500 mi) వరకు విస్తరించి ఉన్న బాహ్య హిమాలయాల పర్వత శ్రేణి. వీటిని చురియా కొండలు అని కూడా అంటారు. తూర్పు వైపు బ్రహ్మపుత్ర నదికి దగ్గరగా, భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలలో 10–50 km (6.2–31.1 mi) వెడల్పు, 1,500–2,000 m (4,900–6,600 ft) సగటు ఎత్తుతో ఈ శ్రేణి విస్తరించి ఉంది. అస్సాంలోని తీస్తా, రైడాక్ నదుల మధ్య దాదాపు 90 km (56 mi) ఈ శ్రేణిలో గ్యాప్ ఉంది.[1] "శివాలిక్" అంటే ' శివుని జటాజూటం' అని అర్థం.[2] శివాలిక్ ప్రాంతం సోనియా (సోన్ నదికి చెందిన) పురావస్తు సంస్కృతికి నిలయం.