సురేఖ
From Wikipedia, the free encyclopedia
సురేఖ అని చూడగానే/వినగానే మహిళ అనిపించే పేరుతో 1958 నుండి వ్యంగ్య చిత్రాలు గీస్తున్న ఇతని అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. "సురేఖ" అన్నపేరు పెట్టుకోవటానికి వెనుక కథ, ఇతనికి మంచి గీతల మీద ఉన్న మమకారం, అప్పటికే పేరు తెచ్చుకున్న బాపు మీద గౌరవం. బాపుకు ఉన్న మరొక కలం పేరు రేఖ. ఆ రేఖను తీసుకుని ఆ పదానికి "సు" తగిలించి, సు + రేఖ = సురేఖగా సంధించి పాఠకుల మీదకు తన వ్యంగ్య చిత్రాలను వదలటం మొదలు పెట్టాడు. సురేఖ అంటే మంచి గీత లేదా శుభ్రమైన గీత అని అర్ధం. తన "కుంచె" పేరును సార్థకం చేసుకుంటూ, మరొక పక్క ఒక పెద్ద బ్యాంకులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తనవంతు సాహిత్య సేవ దశాబ్దాలపాటు కొనసాగించాడు. పదవీ విరమణ తరువాత తనకున్న అనేక అభిరుచులతో పాటు వ్యంగ్య చిత్ర రచనను కూడా కొనసాగిస్తున్నాడు.
త్వరిత వాస్తవాలు మట్టెగుంట వెంకట అప్పారావు, జననం ...
మట్టెగుంట వెంకట అప్పారావు | |
---|---|
![]() సురేఖ | |
జననం | మట్టెగుంట వెంకట అప్పారావు (1941-05-28)1941 మే 28 ఒంగోలు,ప్రకాశం జిల్లా |
నివాస ప్రాంతం | రాజమండ్రి(రాజమహేంద్రవరం) |
ఇతర పేర్లు | సురేఖ, జూబిలీ బాయ్ |
వృత్తి | రిటైర్డు బాంకు డిప్యూటీ మేనేజరు |
భార్య / భర్త | పద్మ |
పిల్లలు | మాధురి, మాధవి, కృష్ణసాయి |
తండ్రి | మట్టెగుంట వెంకటసుబ్బారావు |
తల్లి | మట్టెగుంట సీతాలక్ష్మి |
సంతకం | ![]() |
Notes వీరి నినాదం నవ్వే జనా సుఖినోభవంతు |
మూసివేయి