జోర్గ్ విల్ హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్ (Georg Wilhelm Friedrich Hegel) ఒక ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త. ఇతని ఆలోచనలు ప్రపంచంలోని అనేక మంది తత్వవేత్తలని ప్రభావితం చేశాయి. ప్రతి పదార్థానికి చలనం (motion) ఉంటుందన్న హెగెల్ సూత్రం మార్కిస్ట్ గతితార్కిక భౌతికవాదం పై ఎంతో ప్రభావం చూపింది. కానీ కారల్ మార్క్స్ హెగెల్ తత్వశాస్త్రం నుంచి భావవాద కోణాన్ని, జడతత్వ సూత్రాల్ని తొలిగించి భౌతికవాద గతితార్కిక సూత్రాల ఆధారంగా రచనలు చేశాడు.

త్వరిత వాస్తవాలు Western Philosophy 19th-century philosophy, పేరు: ...
Western Philosophy
19th-century philosophy
Thumb
G.W.F. Hegel
పేరు: Georg Wilhelm Friedrich Hegel
జననం: August 27, 1770 (Stuttgart, Germany)
మరణం: 1831 నవంబరు 14(1831-11-14) (వయసు 61) (Berlin, Germany)
సిద్ధాంతం / సంప్రదాయం: German Idealism; Founder of Hegelianism
ముఖ్య వ్యాపకాలు: Logic, Philosophy of history, Aesthetics, Religion, Metaphysics, Epistemology, Political Science,
ప్రముఖ తత్వం: Absolute idealism, Dialectic, Sublation
ప్రభావితం చేసినవారు: Aristotle, Heraclitus, Anselm, Descartes, Goethe, Spinoza, Rousseau, Böhme, Kant, Fichte, Hölderlin, Schelling
ప్రభావితమైనవారు: Adorno, Barth, Bauer, Bookchin, Bradley, Breton, Croce, Danto, Deleuze, Derrida, Dilthey, Emerson, Engels, Feuerbach, Fukuyama, Gadamer, Gentile, Habermas, Heidegger, Ilyenkov, Kierkegaard, Kojève, Koyré, Küng, Lacan, Lenin, Lukács, Marcuse, Marx, Moltmann, O'Donoghue, Sartre, Stirner, Charles Taylor, Žižek
మూసివేయి

హెగెల్ జీవితం

హెగెల్ 1770, ఆగష్టు 27న జర్మనీలోని స్టట్‌గార్ట్ పట్టణంలో జన్మించాడు. హెగెల్ తండ్రి జార్గ్ లుడ్విగ్ జర్మన్ రాచరిక ప్రభుత్వంలో రెవెన్యూ అధికారిగా పనిచేశాడు. హెగెల్ 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అతని తల్లి మరియ మగ్దలేనా లూయిసా చనిపోయింది. హెగెల్ కి క్రిస్టియేన్ లూయిస్ అనే సోదరి కూడా ఉండేది. హెగెల్ సోదరుడు జోర్గ్ లుడ్విగ్ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ సైన్యంలో అధికారిగా పనిచేసి రష్యన్ యుద్ధంలో చనిపోయాడు.

సంప్రదాయవాద హెగెలీయులు

సంప్రదాయవాద హెగెలీయులు (Right Hegelians) హెగెల్ తత్వశాస్త్రంలోని ప్రగతి నిరోధక భావాల్ని, భావవాద కోణాన్ని, జడతత్వ సూత్రాల్ని సమర్థిస్తారు.

వామపక్ష హెగెలీయులు

వామపక్ష హెగెలీయులు (Left Hegelians) విప్లవ భావాలని సమర్థిస్తారు. హెగెలియన్ తత్వంలోని భావవాదాన్ని వ్యతిరేకిస్తారు. కారల్ మార్క్స్ మొదట వామపక్ష హెగెలీయుల బృందంలో ఉండేవాడు కానీ వామపక్ష హెగెలీయులు జడతత్వ సూత్రాల్ని పూర్తిగా వదిలిపెట్టక పోవడం వల్ల మార్క్స్ వామపక్ష హెగెలీయుల్ని కూడా విమర్శించాడు.

మార్క్సిస్టులు

మార్క్సిజానికి హెగెల్ తత్వశాస్త్రానికి మధ్య మౌలికంగా చాలా తేడాలు ఉన్నప్పటికీ మర్క్స్ హెగెల్ ని తన గురువుగా భావించేవాడు. సమకాలీన మార్క్సిస్టులు కూడా హెగెల్ ని గొప్ప తత్వవేత్తగా పరిగణిస్తారు. ప్రతి పదార్థానికి చలనం (motion) ఉంటుందన్న హెగెల్ సూత్రాన్ని కూడా మార్క్స్ తన గతితార్కిక ఆలోచన విధానంలో చేర్చాడు. ఒకప్పుడు భూస్వామ్య సమాజన్ని పెట్టుబడిదారి సమాజంగా మార్చడం సాధ్యమని అంటే భూస్వామ్య భావవాదులు నమ్మలేదు. ప్రకృతిలో ప్రతివస్తువుకి చలనం (motion) ఉంటుందని, అలాగే సమాజంలో కూడా చలనం ఉంటుందని, భూస్వామ్య సమాజం కూడా చలనం లేని జడపదార్థం కాదని హెగెల్ నమ్మేవాడు. కానీ హెగెల్ లో కూడా అనేక జడతత్వపు ఆలోచనలు, భావవాద భ్రమలు ఉండేవి. ఫ్రెంచ్ విప్లవ కాలంలో భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పెట్టుబడిదారీ విప్లవానికి మద్దతు ఇచ్చినంత వరకు హెగెల్ ప్రగతివాదే. కానీ హెగెల్ జెర్మన్ రాచరిక ప్రభువుని పొగడడం వల్ల అతనిలోని దివాళాకోరుతత్వం (bankruptcy) బయటపడింది. ప్రైవేట్ ఆస్తిని, వర్గ వ్యవస్థని వ్యతిరేకించే మార్క్సిస్టుల దృష్ఠిలో హెగెల్ చాలా దివాళాకోరు తత్వవేత్తే కానీ వారు ఆధునిక గతితార్కిక ఆలోచనా విధానానికి హెగెల్ నే మూల పురుషునిగా పరిగణిస్తారు.

హెగెల్ ఆలోచనలు

హెగెల్ ఆలోచనలలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి భౌతికవాద కోణం ఇంకొకటి భావవాద కోణం. ప్రకృతిలో ప్రతి పదార్థం మార్పులకి లోనవుతుందని, మార్పులకి లొంగని జడ పదార్థం ఉండదని హెగెల్ నిరూపించాడు. కానీ అతనిలో కూడా అనేక జడతత్వపు ఆలోచనలు ఉండేవి. హెగెల్ భౌతికతకి విరుద్ధమైన వాటిని కూడా నమ్మేవాడు. ఉనికి (existence) అనేది ఆలోచన (idea) మీద ఆధారపడి ఉంటుందని ప్రబోధించాడు. హెగెల్ దేవున్ని, ఆత్మని కూడా నమ్మేవాడు.

మతం

హెగెల్ ఒక సంప్రదాయవాద ప్రొటెస్టంటు క్రైస్తవుడు. సంప్రదాయవాద హెగెలీయులు కూడా క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. వామపక్ష హెగెలీయులు నాస్తికులు. మతం మనిషికి పొగ పెడుతుంది తప్ప మతం మనిషిలో నీతిని పెంచదని వారు నమ్ముతారు. హెగెల్ క్రైస్తవ మతాన్ని నమ్మినప్పటికీ అతనిలో మత భావాలు బలంగా లేవని వామపక్ష హెగెలీయులు అంటారు. మతం విషయంలో హెగెల్ అభిప్రాయాలు కొంత అస్పష్టంగా కూడా ఉండేవి.

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.