హోమీ జహంగీర్ భాభా
భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు. ఆ సంస్థలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు.[2] ఆయన అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే (AEET) కు కూడా వ్యవస్థాపక డైరెక్టరు. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమానికి ఈ రెండు సంస్థలూ మూలస్థంభాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని కూడా భాభా డైరెక్టరుగా పర్యవేక్షించాడు.[3] ఆయనను "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు.[3] ఆయన 1942 లో ఆడమ్స్ ప్రైజ్, 1954 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నాడు. 1951, 1953 –1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.[4]
త్వరిత వాస్తవాలు హోమీ జహంగీర్ భాభా, జననం ...
హోమీ జహంగీర్ భాభా | |
---|---|
జననం | (1909-10-30)1909 అక్టోబరు 30 బొంబాయి, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ముంబై) |
మరణం | 1966 జనవరి 24(1966-01-24) (వయసు 56) మౌంట్ బ్లాంక్, ఆల్ఫ్స్ విమాన ప్రమాదం |
జాతీయత | భారతీయుడు |
రంగములు | కేంద్రక భౌతిక శాస్త్రం |
వృత్తిసంస్థలు | అటామిక్ ఎనర్జీ కమీషన్ ఆఫ్ ఇండియా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కావెండిష్ లాబొరేటరీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ |
చదువుకున్న సంస్థలు | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (బి.ఎస్, పి.హెచ్.డి) |
పరిశోధనా సలహాదారుడు(లు) | రాల్ఫ్ హెచ్. ఫోలెర్ |
ఇతర విద్యా సలహాదారులు | పాల్ డిరాక్ |
ప్రసిద్ధి | ఇండియన్ నూక్లియర్ ప్రోగ్రాం కాశ్మిక్ కిరణాల ప్రపాతి విధానము పాయింట్ పార్టికల్స్ భాభా ప్రతిక్షేపణము మౌన్ సిద్ధాంతిక అంచనా |
ముఖ్యమైన పురస్కారాలు | ఆడమ్స్ ప్రైజ్ (1942) పద్మభూషణ్ పురస్కారం (1954) రాయల్ సొసైటీ ఫెలోషిప్[1] |
మూసివేయి