గుండ్లకమ్మ నది
ఆంధ్రప్రదేశ్ లో నది / From Wikipedia, the free encyclopedia
గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది, పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది. దీనిపై కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగు నీటి అవసరాలను తీరుస్తున్నారు.