తమిళ భాష
ద్రవిడ వర్గానికి చెందిన ఒక భారతీయ భాష / From Wikipedia, the free encyclopedia
తమిళం (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడతారు. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు.1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తెలుగు భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష తమిళమే.ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో తమిళం 19వ స్థానంలో ఉంది.[1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు తమిళం, స్థానిక భాష ...
తమిళం | |
---|---|
అరవం | |
స్థానిక భాష | తమిళనాడు, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవులు |
ప్రాంతం | శ్రీలంక, సింగపూర్, భారతదేశం. |
స్వజాతీయత | తమిళ ప్రజలు |
స్థానికంగా మాట్లాడేవారు | 75 మిలియన్ |
భాషా కుటుంబం | mongloid,దక్షిణ ద్రావిడ
|
భాషా సంకేతాలు | |
ISO 639-3 | – |
మూసివేయి