శ్రీలంక
ఆసియా లోని దేశం / From Wikipedia, the free encyclopedia
శ్రీలంక (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు, ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతము నకు, సంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు, ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. టీ, కాఫీ, రబ్బరు,, కొబ్బరి కాయల ఎగుమతులకు శ్రీలంక ప్రసిద్ధి గాంచింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక వాణిజ్య వ్యవస్థ, ప్రకృతి అందాలు సముద్ర తీర ప్రాంతాలు,, అడవులు ఘనమైన సంస్కృతి, నాగరికతలు దీనిని పర్యటక కేంద్రంగా నిలుపుతున్నాయి. రెండు వేల సంవత్సరాలపాటు చిన్న రాజ్యాలుగా పాలింపబడిన శ్రీలంకకు, 16వ శతాబ్దం మొదటి భాగంలో పోర్చుగీసు వారి రాకతో విదేశీయుల రాక ఆరంభమైంది. 1815వ సంవత్సరంకల్లా బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948 లో స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈశాన్య ప్రాంతంలో పొంచిఉన్న తమిళ పులులు.
இலங்கை ஜனநாயக சமத்துவ குடியரசு ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర శ్రీలంక |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
రాజధాని | శ్రీ జయవర్ధనపుర-కొట్టె 6°54′N 79°54′E | |||||
అతి పెద్ద నగరం | కొలంబో | |||||
అధికార భాషలు | సింహళ, తమిళం | |||||
ప్రభుత్వం | ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యము | |||||
- | అధ్యక్షుడు | గోటబాయ రాజపక్ష (2019 ఎన్నికల ఫలితం) | ||||
- | ప్రధానమంత్రి | 2019 ఎన్నిక | ||||
స్వాతంత్ర్యము | యునైటెడ్ కింగ్డం నుండి | |||||
- | ప్రకటన | ఫిబ్రవరి 4 1948 | ||||
- | గణతంత్రము | మే 22 1972 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 65,610 కి.మీ² (122వ) 25,332 చ.మై |
||||
- | జలాలు (%) | 4.4 | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 19,668,000[1] (52వ) | ||||
- | 2001 జన గణన | 18,732,255 | ||||
- | జన సాంద్రత | 310 /కి.మీ² (35వ) 818 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $86.72 బిలియన్ (61వ) | ||||
- | తలసరి | $4,600 (111వ) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $26.794 బిలియన్ (78వ) | ||||
- | తలసరి | $1,355 (119వ) | ||||
జినీ? (1999–00) | 33.2 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.755 (medium) (93వ) | |||||
కరెన్సీ | శ్రీలంక రూపాయి (LKR ) |
|||||
కాలాంశం | (UTC+5:30) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .lk | |||||
కాలింగ్ కోడ్ | +94 |