దక్షిణ కొరియా
From Wikipedia, the free encyclopedia
దక్షిణ కొరియాను అధికారికంగా కొరియా గణతంత్రం[2] అంటారు. కొరియన్ ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియా సార్వభౌమాధికారం కలిగిన దేశం. కొరియా అనే పేరు గొరియో అనే పదము నుండి వచ్చింది. గొరియా మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం. దక్షిణ కొరియా పడమర భాగంలో చైనా, తూర్పున జపాన్, ఉత్తరంలో ఉత్తర కొరియా ఉన్నాయి. దక్షిణ కొరియా ఉత్తర సమశీతోష్ణ మండలంలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంది. దక్షిణ కొరియా వైశాల్యం 99,392 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 5 కోట్లు, రాజధాని, అతి పెద్ద నగరం సియోల్. సియోల్ నగర జనాభా 98 లక్షలు.
대한민국 大韓民國 దేహన్ మింగుక్ కొరియా గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Aegukga (애국가; 愛國歌) Patriotic Hymn |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | సియోల్ 37°35′N 127°0′E | |||||
అధికార భాషలు | కొరియన్ | |||||
ప్రభుత్వం | Presidential రిపబ్లిక్ | |||||
- | President | Moon Jae-in | ||||
- | Prime Minister | Kim Boo-kyum | ||||
Establishment | ||||||
- | Liberation declared | మార్చి 1 1919 (de jure) | ||||
- | Liberation | ఆగస్టు 15 1945 | ||||
- | First Republic | ఆగస్టు 131948 | ||||
- | ఐక్యరాజ్యసమితి గుర్తింపు | డిసెంబరు 12 1948 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 99,646 కి.మీ² (108వ) 38,492 చ.మై |
||||
- | జలాలు (%) | 0.3 | ||||
జనాభా | ||||||
- | February 2007 అంచనా | 49,024,737 (25వ) | ||||
- | జన సాంద్రత | 480 /కి.మీ² (19వ) 1,274 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $1.196 trillion[1] (11th) | ||||
- | తలసరి | $24,500 (34వ) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.912 (high) (26th) | |||||
కరెన్సీ | South Korean won (KRW ) |
|||||
కాలాంశం | Korea Standard Time (UTC+9) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+9) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | en:.kr | |||||
కాలింగ్ కోడ్ | +82 | |||||
1 | Cell phone system CDMA | |||||
2 | Domestic power supply 220V/60 Hz, CEE 7/7 sockets |
పురాతత్వ పరిశోధకులు కొరియన్ ద్వీపపకల్పంలో దిగువ రాతియుగ కాలం నుండి మానవులు నివసించడం ఆరంభమైనదని భావిస్తున్నారు. క్రీ.ఫూ 2333 లో కొరియా ద్వీపకల్పాన్ని దన్-గన్ల చేత కనిపెట్టబడడంతో కొరియా చరిత్ర ఆరంభం అయింది. సా.శ. 668 లో కొరియాలోని 3 రాజ్యాలను సమైక్య సిల్లా సామ్రాజ్యంగా మార్చబడిన తరువాత గొరియో సామ్రాజ్యంగా (918-1392) వరకు పాలించబడింది. తరువాత జోసియన్ సామ్రాజ్యంగా (1392-1910) పరిపాలించబడింది. 1910లో ఇది జపాన్ సామ్రాజ్యంతో చేర్చబడింది. రెండవప్రపంచ యుద్ధానంతరం 1948లో కొరియా సోవియట్ భూభాగం, యు.ఎస్ భూభాగంగా విభజించబడింది. ఐక్యరాజ్యసమితి కొరియా రిపబ్లిక్ మాత్రమే చట్టబద్ధమైన దేశం అని ప్రకటించినప్పటికీ సోవియట్ రష్యా ప్రతీకారంగా ఉత్తరకొరియాలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది.
1950లో ఉత్తర కొరియా సేనలు దక్షిణ కొరియాలో ప్రవేశించడంతో కొరియన్ యుద్ధం ఆరంభం అయింది. యు.ఎస్, చైనా, సోవియట్, ఇతరదేశాల జోక్యంతో మూడు సంవత్సరాల కాలం సాగిన యుద్ధం ముగింపుకు వచ్చింది. ఇరు కొరియా దేశాల నడుమ నిర్మించబడిన కోటలు ప్రపంచంలోనే అత్యధిక బలమైనవని భావించబడుతున్నాయి. తరువాత దశాబ్దాలలో దక్షిణ కొరియా ఆర్థికంగా గుర్తించతగినంతగా అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణ కొరియా ఆర్థికవ్యవస్థ ప్రపంచలో ప్రధానమైనదిగా మారింది. 1987లో ప్రజాప్రభుత్వం స్థానంలో సైనికపాలన చోటుచేసుకుంది. ప్రస్తుతం దక్షిణ కొరియా తుపాకి నియంత్రిత చట్టాలను అమలు చేస్తుంది. అందువలన దక్షిణ కొరియాలో ప్రజలు అతితక్కువ తుపాకీ అనుమతులను కలిగి ఉన్నారు.
దక్షిణ కొరయాలో అధ్యక్షపాలనా విధానం అనుసరించబడుతుంది. దక్షిణ కొరియా ప్రజల జీవనప్రమాణం అత్యున్నత స్థాయిలో ఉంది. తైవాన్ఆసియాలో ఆసియాలో నాగవస్థానంలో ఉంది. ఆర్థికంగా తైవాన్ ఆసియాలో నాలుగవ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచన్లో 15 వ స్థానంలో ఉంది. తైవాన్ కొనుగోలుశక్తి ప్రపంచంలో 12 వ స్థానంలో ఉంది. ఎగుమతులు, ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, నౌకలు, యంత్రాలు, పెట్రోలియం రసాయనాలు, రోబోటిక్ ఉత్పత్తులు, ఎగుమతులు ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్నాయి.