మామిడి హరికృష్ణ
కవి, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, చిత్రకారుడు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు / From Wikipedia, the free encyclopedia
డా. మామిడి హరికృష్ణ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడిగా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత. వివిధ పత్రికలలో వేలాది వ్యాసాలు రాసిన అతను రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.[1] 2014, అక్టోబరు 28 నుండి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 'తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం' అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశాడు.[2]
త్వరిత వాస్తవాలు డా. మామిడి హరికృష్ణ, జననం ...
డా. మామిడి హరికృష్ణ | |
---|---|
జననం | హరికృష్ణ శాయంపేట, వరంగల్ జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు,తెలంగాణ |
వృత్తి | తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు |
ప్రసిద్ధి | మామిడి హరికృష్ణ |
మతం | హిందూ |
తండ్రి | సుదర్శన్ |
తల్లి | స్వరాజ్యం |
మూసివేయి