ముచ్చివోలు
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
ముచ్చివోలు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన అతి పెద్ద పంచాయితీలలో ఒకటి. శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం. బస్సులలో సుమారు 30 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చును. గ్రామ దేవత బైకమ్మ. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకీ విద్యావంతుల గ్రామంగా దీనికి పేరుంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. అంగన్ వాడీ నుంచి పదవ తరగతి వరకూ విద్యా సౌకర్యం ఉంది. మూడు ప్రధాన ఆలయాలు, మూడు చిన్న ఆలయాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మొదలైన పండుగలే కాక పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, బైకమ్మ సంతర్పణ ఘనంగా నిర్వహిస్తారు.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 13.797816°N 79.634743°E /, రాష్ట్రం ...
ముచ్చివోలు | |
— రెవిన్యూ గ్రామం — | |
ముచ్చివోలు ఉన్నత పాఠశాల | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13.797816°N 79.634743°E / 13.797816; 79.634743 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | శ్రీకాళహస్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,823 |
- పురుషుల | 932 |
- స్త్రీల | 891 |
- గృహాల సంఖ్య | 485 |
పిన్ కోడ్ | 517 536 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి