సహాయం:IPA
From Wikipedia, the free encyclopedia
ఇక్కడ అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాలలోని ముఖ్యమైన గుర్తులకు వివేచనం ఇవ్వబడింది. ఆంగ్లంలోని అక్షరాలకు సరిపోయే పరిమిత పట్టిక కోసం సహాయం:IPA for English చూడండి. సంస్కృత ధ్వనులకై సహాయం:IPA for Sanskrit చూడగలరు. ఇంకా కొన్ని అరుదుగా వాడే గుర్తులను ఇక్కడ చేర్చలేదు. వాటిని వ్యాసంలో చూడవచ్చు.
ఇదొక సమాచారం పేజీ. ఇది వికీపీడియా విధానం గానీ, మార్గదర్శకం గానీ కాదు. ఇది వికీపీడియా సంప్రదాయాలు, కట్టుబాట్లు, సాంకేతికాంశాలు, అవలంబించే పద్ధతులకు సంబంధించిన కొన్ని విషయాలను వివరిస్తుంది.. ఇందులో ఏకాభిప్రాయం, అర్థ స్వీకరణ లలో విభిన్న స్థాయిలు ఉండవచ్చు. |
|
ప్రతీ గుర్తుకూ వీలున్నచోట అందుకు సమాన తెలుగు అక్షరాన్ని కానీ, అక్షరం లేనప్పుడు పదాన్ని కానీ ఇవ్వడమైనది. తెలుగులో లేని ధ్వనులను సూచించే గుర్తులకు, తెలుగువారికి పరిచయముండేఔదుకు అవకాశమున్న ఆంగ్లం లేదా హిందీ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఈ మూడు భాషల్లోనూ లేని శబ్దాలకు ఇతర భాషల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.
ఎడమ పక్క గళ్ళలో గుర్తులు ఇలా కనిపిస్తాయి: [a] ( listen). "listen" మీద నొక్కితే ఆ ధ్వనిని వినవచ్చు. గుర్తు మీద నొక్కితే ఆ ధ్వని యొక్క వికి వ్యాసానికి వెళతారు. ధ్వనుల ఆడియొలో హల్లులు విన్నప్పుడు, హల్లు ఒకసారి పలుకబడి, మధ్యలో విరామ చిహ్నంగా 'అ'కారం పలుకబడి, మళ్ళీ హల్లు ఇంకోసారి పలుకబడుతుంది.