![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a8/%25E7%2594%259C%25E6%25B0%25B4%25E6%25B5%25B7%25E5%2585%25B5%25E7%25AB%2599.jpg/640px-%25E7%2594%259C%25E6%25B0%25B4%25E6%25B5%25B7%25E5%2585%25B5%25E7%25AB%2599.jpg&w=640&q=50)
అక్సాయ్ చిన్
చైనా ఆక్రమణలో ఉన్న భారత్ లోని లడఖ్ భూభాగం / From Wikipedia, the free encyclopedia
అక్సాయ్ చిన్, ఆక్సాయ్ కిన్ లేదా అకేసాయికిన్, పశ్చిమ కున్లూన్ పర్వతాలకు ఉత్తరంగా, టిబెట్ పీఠభూమి వాయవ్య ప్రాంతంలో ఉన్న వివాదాస్పద ప్రదేశం.[2] ఈ ప్రాంతమంతా షిన్జాంగ్ స్వయంపాలిత ప్రాంతం యొక్క హోటాన్ ప్రిఫెక్చర్ లోని హోటన్ కౌంటీలో భాగంగా, చైనా ఆక్రమణలో ఉంది. అయితే, భారతదేశం దీనిని తన లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా పరిగణిస్తుంది. భారత, చైనా దేశాల మధ్య ఉన్న రెండు ముఖ్యమైన వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో అక్సాయ్ చిన్ ఒకటి. రెండవది భారతదేశ పరిపాలనలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్. భారతదేశం అక్సాయ్ చిన్ ను, మాజీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపు తూర్పు ప్రాంతంగా ప్రస్తావించేది. ఇప్పుడది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. జమ్మూ, కాశ్మీర్ లోని భారత-పాలిత ప్రాంతాలను అక్సాయ్ చిన్ నుండి వేరు చేసే రేఖను, వాస్తవాధీన రేఖ అంటారు. ఇది ప్రస్తుతం చైనా అక్సాయ్ చిన్ ప్రస్తావన రేఖతో ఏకీభవిస్తోంది (అనగా, అక్సాయ్ చిన్ యొక్క పశ్చిమ సరిహద్దు)
అక్సాయ్ చిన్ | |
---|---|
జింజియాంగ్, టిబెట్లలో భాగంగా, చైనా ఆక్రమణలో ఉంది. | |
![]() అక్సాయ్ చిన్ లోని టియాన్షుయిహాయిలో ఉన్న చైనా సైన్యపు సర్వీస్ స్టేషను సూచిక | |
![]() చైనా ఆక్రమణలో ఉన్న లడఖ్ లోని అక్సాయ్ చిన్ ప్రాంతం. | |
Coordinates: 35°7′N 79°8′E | |
ఆక్రమించిన దేశం | ![]() |
విస్తీర్ణం | |
• Total | 38,850 km2 (15,000 sq mi) |