ఈక్వడార్
ఇది దక్షిణ అమెరికా లోని ఒక గణతంత్ర దేశం / From Wikipedia, the free encyclopedia
ఈక్వెడార్ (ఆంగ్లం : ఈక్వడార్), అధికారిక నామం ఈక్వెడార్ రిపబ్లిక్. ఇది దక్షిణ అమెరికా లోని ఒక గణతంత్ర దేశం. దీని ఉత్తరసరిహద్దులో కొలంబియా, తూర్పు, దక్షిణ సరిహద్దులలో పెరూ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. దీని రాజధాని క్విటో. దేశంలోని అతిపెద్ద నగరం గ్వాయాక్విల్.
రిపబ్లికా డెల్ ఈక్వెడార్ రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Dios, patria y libertad" "Pro Deo, Patria et Libertate" "God, homeland and liberty" |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని | Quito 00°9′S 78°21′W | |||||
అతి పెద్ద నగరం | en:Guayaquil | |||||
అధికార భాషలు | స్పానిష్ భాష1 | |||||
జాతులు | 55% Mestizo, 25% Amerindian, 15% White, 5% African | |||||
ప్రజానామము | Ecuadorian | |||||
ప్రభుత్వం | Presidential republic | |||||
- | అధ్యక్షుడు | Rafael Correa | ||||
- | ఉపాధ్యక్షుడు | Lenín Moreno | ||||
స్వాతంత్య్రం | ||||||
- | from Spain (Failed) | August 10, 1809 | ||||
- | from Spain | May 24, 1822 | ||||
- | from en:Gran Colombia | May 13, 1830 | ||||
- | జలాలు (%) | 4 | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 13,922,000 (65th) | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $104.67 billion[1] | ||||
- | తలసరి | $7,518[1] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $54.67 billion[1] | ||||
- | తలసరి | $3,927[1] | ||||
జినీ? | 42 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.807 (high) (72nd) | |||||
కరెన్సీ | U.S. dollar2 (USD ) |
|||||
కాలాంశం | ECT, GALT (UTC-5, -6) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ec | |||||
కాలింగ్ కోడ్ | +593 | |||||
1 | en:Quechua and other en:Amerindian languages spoken by indigenous communities. | |||||
2 | Sucre until 2000, followed by the U.S. dollar and en:Ecuadorian centavo coins |
వివిధ రకాల అమెరిండియన్ ప్రజలు నివసించిన ప్రస్తుత ఈక్వడార్ భూభాగం 15వ శతాబ్దంలో క్రమంగా ఇన్కా సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ భూభాగం 16 వ శతాబ్దంలో స్పెయిన్ వలస రాజ్యంగా మారింది. 1820 లో గ్రాన్ కొలంబియాలో భాగంగా ఈ భూభాగానికి స్వాతంత్ర్యం లభించింది. 1830 లో ఈక్వడార్ సార్వభౌమ రాజ్యంగా ఉద్భవించింది. రెండు సామ్రాజ్యాల ప్రభావం ఈక్వెడార్‌లో విభిన్న జాతులు, సాంప్రదాయక వైవిధ్యం ప్రతిబింబించడానికి కారణం అయింది. 16.4 మిలియన్ల ఈక్వడార్ జనాభాలో సింహభాగం మెస్టిజోలు ఉన్నారు. పెద్ద సంఖ్యలోని మైనారిటీల్లో యూరోపియన్లు, అమెరిండియన్లు, ఆఫ్రికన్లు ఉన్నారు.
ఈక్వడార్ అధికారిక భాష, అత్యధిక జనాభా మాట్లాడే భాష స్పానిష్.. దీనితో పాటు క్విచూవా, షూర్తో సహా 13 అమెరిండియన్ భాషలు కూడా గుర్తింపు కలిగి ఉన్నాయి. రాజధాని నగరం క్విటో. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ చారిత్రాత్మక కేంద్రంగా ఉన్న క్విటో నగరాన్ని 1978 లో యునెస్కో గొప్ప ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.[2][3]
అమెరికా ఖండాలలోని ప్రణాళిక ప్రకారం స్పానిష్-శైలి వలస రాజ్య నగరానికి అసాధారణ ఉదాహరణగా ఉన్న మూడవ అతిపెద్ద నగరం అయిన కున్కా (ఈక్వడార్) నగరం 1999 లో వరల్డ్ హెరిటేజ్ సైట్ (ప్రపంచవారసత్వ సంపదగా) ప్రకటించబడింది.
[4] ఈక్వడార్ ఆర్థికరంగం అధికంగా పెట్రోలియం, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైన నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంది. దేశం మధ్యస్థ ఆదాయ కలిగిన దేశంగా వర్గీకరించబడింది. ఈక్వడార్ డొమెక్రటిక్ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ గా వర్గీకరించబడి ఉంది. 2008 కొత్తగా రాజ్యాంగం పర్యావరణ పరిరక్షణ హక్కులను చట్టబద్ధంచేసి ప్రపంచదేశాలలో ఇలా చేసిన మొదటి దేశంగా గుర్తించబడింది.[5] ఈక్వడార్ లోని గలాపాగోస్ ద్వీపాల సుసంపన్నమైన పర్యావరణ వనరులు అంతరించిపోతున్న పలు జంతుజాలానికి, వృక్షజాలానికి నిలయంగా ఉంది. ప్రపంచంలోని 17 మహావైవిధ్య పర్యావరణ వనరులు కలిగిన దేశాలలో ఈక్వడార్ ఒకటి.[6][7]