ఉత్తర మేసిడోనియా
From Wikipedia, the free encyclopedia
ఉత్తర మేసిడోనియా లేదా ఉత్తర మెసిడోనియా (ఆంగ్లం : North Macedonia), అధికారికనామం ఉత్తర మెసిడోనియా గణతంత్రం (ఆంగ్లం : Republic of North Macedonia). (1992-2019 మెసిడోనియ (ఆంగ్లం : Macedonia), అధికారికనామం మెసిడోనియా గణతంత్రం (ఆంగ్లం : Republic of Macedonia)) ఐరోపా లోని మధ్య బాల్కన్ సింధూశాఖ లో గల దేశం. ఇది యుగోస్లేవియా నుండి వేరుచేయబడి ఏర్పరచిన దేశం.[3][4] ఇదొక భూపరివేష్టిత దేశం. 1991లో యుగొస్లేవియా నుండి స్వతంత్రం పొంది ఇది స్వతంతేదేశంగా అవతరించింది. 1993 లో ఇది ఐక్యరాజ్యసమితి సభ్యదేశం అయింది.అయినప్పటికీ మెసిడోనియా అన్న విషయంలో వివాదం కొనసాగుతుంది.దేశం పూర్వనామం " యుగొస్లేవియా రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా ". [5][6] దీని ఉత్తరసరిహద్దులో సెర్బియా, కొసావో, తూర్పుసరిహద్దులో బల్గేరియా, దక్షిణసరిహద్దులో గ్రీస్, పశ్చిమసరిహద్దులో అల్బేనియా దేశాలు ఉన్నాయి.[7] దీని రాజధాని స్కోప్జే. 2004 జనగణన ప్రకారం జనసంఖ్య 5,06,926.
Република Северна Македонија Republika Severna Makedonija రిపబ్లిక్ ఆఫ్ ఉత్తర మేసిడోనియా |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
Location of the ఉత్తర మేసిడోనియా (orange) on the European continent (white) — [Legend] |
||||||
రాజధాని | Skopje 42°0′N 21°26′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | Macedonian1[1] | |||||
ప్రజానామము | Macedonian | |||||
ప్రభుత్వం | Parliamentary republic | |||||
- | President | Branko Crvenkovski | ||||
- | Prime Minister | Nikola Gruevski | ||||
- | President-elect | Gjorge Ivanov | ||||
Independence from | యుగోస్లేవియా | |||||
- | Independence declared Officially recognized |
8 September 1991 8 April 1993 |
||||
- | జలాలు (%) | 1.9% | ||||
జనాభా | ||||||
- | 2009 అంచనా | 2,114,550 (142nd) | ||||
- | 2002 జన గణన | 2,022,547 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $17.396 billion[2] | ||||
- | తలసరి | $8,490[2] (IMF) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $7.685 billion[2] | ||||
- | తలసరి | $3,750[2] (IMF) | ||||
జినీ? (2004) | 29.3 (low) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | 0.801 (high) (69th) | |||||
కరెన్సీ | Macedonian denar (MKD ) |
|||||
కాలాంశం | CET (UTC+1) | |||||
- | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mk | |||||
కాలింగ్ కోడ్ | +389 | |||||
1 | Albanian is widely spoken in the west of the country. In some areas Turkish, Serbian, Romany and Aromanian are also spoken. |
(కొన్నిసార్లు ఎఫ్.వై.ఆర్.ఒ.ఎం., పి.వై.ఆర్. మాసిడోనియాగా సంక్షిప్తీకరించబడింది), యూరోపియన్ యూనియన్,[8] " కౌంసిల్ ఆఫ్ యూరప్ ",[9] నాటో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పదం ఉపయోగిస్తున్నాయి.[10]
భూభాగం ఉన్న దేశం రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాకు వాయవ్యసరిహద్దులో కొసావో, ఉత్తరసరిహద్దులో సెర్బియా, తూర్పుసరిహద్దులో బల్గేరియా, దక్షిణసరిహద్దులో గ్రీస్, పశ్చిమసరిహద్దులో అల్బేనియా వరకు సరిహద్దులుగా ఉన్నాయి.[11] ఇది బృహత్తరమైన మాసిడోనియా భౌగోళిక ప్రాంతంలో వాయవ్యభూభాగంలో మూడవ భాగాన్ని కలిగి ఉంది. ఇందులో ఉత్తర గ్రీస్ యొక్క పొరుగు భాగాలు, నైరుతి బల్గేరియా, ఆగ్నేయ అల్బేనియా యొక్క చిన్న భాగాలను కలిగి ఉంది. దేశం యొక్క భూగోళశాస్త్రం ప్రధానంగా పర్వతాలు, లోయలు, నదులు ఉన్నాయి. రాజధాని, అతిపెద్ద నగరం స్కోప్జే. ఈనగరంలో దేశం 2.06 మిలియన్ల నివాసితులలో దాదాపుగా పావుభాగం నివసిస్తూ ఉన్నారు. నివాసితులు ఎక్కువమంది మేసిడోనియన్ జాతిప్రజలు, దక్షిణ స్లావిక్ ప్రజలు ఉన్నారు. అల్పసంఖ్యాకులలో ఆధిక్యత కలిగిన అల్బేనియాలు గణనీయంగా 25% ఉన్నారు. తరువాతి స్థానాల్లో టర్కులు, రోమానీ, సెర్బులు, ఇతరులు ఉన్నారు.
మాసిడోనియా చరిత్ర పురాతన కాలం నాటిది. ఇది పేయోనియా రాజ్యంతో మొదలైంది. ఇది బహుశా మిశ్రమ త్రాకో-ఇలీయ్రియన్ రాజ్యం.[12] క్రీ.పూ.6 శతాబ్దంలో ఈ ప్రాంతం పర్షియన్ అకేమెనిడ్ సామ్రాజ్యంలో చేర్చబడింది. తరువాత నాల్గవ శతాబ్దంలో మేసిడోనియా సామ్రాజ్యంతో విలీనం చేయబడింది. రోమన్లు క్రీ.పూ. 2 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు, మాసిడోనియా ప్రధాన భూభాగంలో భాగంగా ఉంది. మేసిడోనియా బైజాంటైన్ (తూర్పు రోమన్) సామ్రాజ్యంలో భాగంగా ఉండి క్రైస్తవ యుగంలో 6 వ శతాబ్దంలో స్లావిక్ ప్రజలచే తరచుగా దాడి చేయబడి తరువాత స్లావిక్ ప్రలలకు స్థిరనివాసం అయింది. బల్గేరియన్, బైజాంటైన్, సెర్బియన్ సామ్రాజ్యాల మధ్య శతాబ్దాల మధ్య జరిగిన వివాదాల తరువాత ఇది క్రమంగా 14 వ శతాబ్దం నుండి ఒట్టోమన్ రాజ్యపాలనలోకి వచ్చింది. 1912 చివరలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో ఒక ప్రత్యేకమైన మాసిడోనియన్ గుర్తింపు ఉద్భవించింది. 1912, 1913 ల బాల్కన్ వార్స్ తరువాత, మాసిడోనియా యొక్క ఆధునిక భూభాగం సెర్బియన్ పాలనలో వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత (1914-1918) ఇది యుగోస్లేవియా " సెర్బ్-ఆధిపత్య రాజ్యంలోకి విలీనం చేయబడింది. రెండో ప్రపంచ యుద్ధం రిపబ్లిక్ (1945) గా తిరిగి స్థాపించబడిన తరువాత , " సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా 1991 లో యుగొస్లావియాలో శాంతియుత విభజన వరకు మాసిడోనియా ఒక రాజ్యాంగ సామ్యవాద గణతంత్రంగా మిగిలిపోయింది.
మేసిడోనియా ఐక్యరాజ్య సమితి, ఐరోపా కౌన్సిల్ సభ్యదేశం. 2005 నుంచి ఇది యూరోపియన్ యూనియన్లో చేరడానికి అభ్యర్థిగా ఉంది, నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. ఐరోపాలో అత్యంత పేద దేశాలలో ఒకటి అయినప్పటికీ మేసిడోనియా బహిరంగ మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో గణనీయమైన పురోగతిని సాధించింది.