గోను తుఫాను
From Wikipedia, the free encyclopedia
2007 జూన్‌లో సంభవించిన తుఫాన్ పేరు గోను (Cyclone Gonu -JTWC designation: 02A, also known as Super Cyclonic Storm Gonu) . అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. [1] జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో చిన్న అల్పపీడన ద్రోణి (convection) గా ఇది ప్రారంభమైంది. ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి దిశ అనుకూలంగా ఉండడంతో ఇది జూన్ 3 నాటికి ఉధృతంగా, 240 km/h (150 mph) గాలి వేగంతో బలపడింది అని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. తరువాత పొడి గాలులు, చల్లని సముద్రజలాల కారణంగా కాస్త బలహీనపడింది.
Category 5 tropical cyclone (SSHWS) | |
చలనం | తుపాను స్థితి |
---|---|
ఏర్పడిన తేదీ | 2007 జూన్ 1 |
సమసిపోయిన తేదీ | 2007 జూన్ 7 |
అత్యధిక గాలులు | 10-minute sustained: 240 km/h (150 mph) 1-minute sustained: 260 km/h (160 mph) |
అత్యల్ప పీడనం | 920 hPa (mbar); 27.17 inHg |
మరణాలు | 72 |
నష్టం | $4.22 billion (2007 USD) |
ప్రభావిత ప్రాంతాలు | ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, ఇరాన్ |
Part of the 2007 North Indian Ocean cyclone season | |
జూన్ 5వ తారీఖున ఇది ఒమన్ తూర్పు తీరాన్ని (రాస్ అల్ హద్ వద్ద) తాకింది. అరేబియన్ ద్వీపకల్పంలో ఇంత పెద్ద తుఫాన్ ఇంతకు ముందు నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో అల్ప పీడనాలు బలహీనంగా ఉంటాయి. అవికూడా త్వరగా చెదరిపోతాయి. [2]