యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
From Wikipedia, the free encyclopedia
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా ఖండమునకు చెందినా దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా, దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు. 1971 లో ఈ దేశము ఏడు ఏమిరట్ల (1. అభూ దాభి, 2. అజ్మన్, 3. దుబాయ్, 4. ఫుజిరా, 5. రసల్ ఖైమా, 6. షార్జా, 7.ఉమ్మాల్ ఖ్వాయిస్న్ ) సమైక్యగ ఏర్పడినది వీటిలో అభూ దాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. సంయుక్త ఏమిరట్ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడిగా పర్యవెక్షింపబడును. ఇస్లాం మతం యు.ఎ.ఇ. యొక్క అధికారిక మతంగా ఉంది, ఆంగ్లం కూడా విస్తారంగా వాడబడుతుంది. అరబిక్ అధికారిక భాష.
الإمارات العربية المتحدة యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
|||||
---|---|---|---|---|---|
నినాదం "---" |
|||||
జాతీయగీతం ఇషి బిలాడీ |
|||||
రాజధాని | అబు దాబి 22°47′N 54°37′E | ||||
పెద్ద నగరం | రాజధాని | ||||
అధికార భాషలు | అరబిక్ | ||||
ప్రజానామము | ఎమిరేట్స్ | ||||
ప్రభుత్వం | సమాఖ్య రాజ్యాంగ రాచరికం | ||||
- | అధ్యక్షుడు | ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహయాన్ | |||
- | ప్రధాన మంత్రి | మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ | |||
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | డిసెంబర్ 2 1971 | ||||
విస్తీర్ణం | |||||
- | మొత్తం | 83,600 కి.మీ² (116 వ) 32,278 చ.మై |
|||
- | జలాలు (%) | అతితక్కువ | |||
జనాభా | |||||
- | 2005 అంచనా | 4,496,000 (116 వ) | |||
- | 2005 జన గణన | 4,104,695 | |||
- | జన సాంద్రత | 64 /కి.మీ² (143 వ) 139 /చ.మై |
|||
జీడీపీ (PPP) | 2006 అంచనా | ||||
- | మొత్తం | $ 9 129.3 బిలియన్ (55 వ) | |||
- | తలసరి | $29,142 బిలియన్ (24 వ) | |||
జీడీపీ (nominal) | 2006 అంచనా | ||||
- | మొత్తం | $164 బిలియన్ (40 వ) | |||
- | తలసరి | $33,397 బిలియన్ (21 వ) | |||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | తగ్గుదల 0.839 (high) (49 వ) | ||||
కరెన్సీ | యుఎఇ దిర్హామ్ (యునైటెడ్ అరబ్ దిర్హామ్ ) |
||||
కాలాంశం | GMT+4 (UTC+4) | ||||
- | వేసవి (DST) | (UTC+4) | |||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | యు.ఎ.ఇ | ||||
కాలింగ్ కోడ్ | +971 |
1970 కాలంలో దుబాయి, ఆబుధాబి, షార్జా, ఆజ్మాన్, ఉమ్మాల్ ఖ్వాయిస్, ఫుజిరా, రాస్ అల్ ఖైమాలు వేర్వేరు జెండాలు, వేర్వేరు విధానాలతో విభిన్న తెగలకు చెందిన రాజులు పరిపాలిస్తున్న వేర్వేరు దేశాలు.ఈ రాజ్యాలన్నీ కూడా కీలకమైన అరేబియా సముద్ర తీరంలో ఉన్నాయి. అన్ని దేశాలకూ రేవు కేంద్రాలు ఉన్నాయి. కొందరి వద్ద చమురు సంపాదన ఉండగా మరికొందరి వద్ద లేదు. 1971లో రాస్ అల్ ఖైమా మినహా మిగిలిన దేశాలన్నీ కలిసి సమైక్యంగా సమాఖ్య రూపంలో ఉండడానికి తీర్మానం చేసుకొన్నాయి (మరుసటి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా చేరింది). ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల వరకు ఒక ఎమిరేట్ నుంచి మరో ఎమిరేట్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది.
యు.ఎ.ఇ. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నది, ప్రపంచంలోనే పదిహేడవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు కలిగి ఉంది. షేక్ జాయెద్ యు.ఎ.ఇ. యొక్క మొదటి అధ్యక్షుడు పాలకుడు ఎమిరేట్స్ అభివృద్ధి పర్యవేక్షించారు, చమురు ఆదాయాలతో ఆరోగ్య, విద్య అభివ్రుద్ది పరిచారు.