భారతీయ నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia
జయలలిత (జ.ఫిబ్రవరి 24, 1948—మ.డిసెంబరు 5, 2016) ప్రముఖ రాజకీయనాయకురాలు, తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబరులో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.[1] తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మను పిలిచాడు అని పిలుచుకుంటా ఉంటారు.
జె. జయలలిత J Jayalalitha ஜெ. ஜெயலலிதா | |||
16th | |||
---|---|---|---|
పదవీ కాలం 16 మే 2011 – 28 సెప్టెంబెర్ 2014 | |||
ముందు | ఎం.కరుణానిధి | ||
తరువాత | ఓ. పన్నీర్‌సెల్వం | ||
నియోజకవర్గం | శ్రీరంగం | ||
14th తమిళనాడు ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 2 మార్చి 2002 – 12 మే 2006 | |||
ముందు | ఓ.పన్నీర్‌సెల్వం | ||
తరువాత | ఎం.కరుణానిధి | ||
నియోజకవర్గం | ఆండిపట్టి | ||
తమిళనాడు ముఖ్యమంత్రి (క్వాషెద్) | |||
పదవీ కాలం 14 మే 2001 – 21 సెప్టెంబర్ 2001 | |||
ముందు | ఎం.కరుణానిధి | ||
తరువాత | ఓ.పన్నీర్‌సెల్వం | ||
నియోజకవర్గం | పోటీ చేయలేదు | ||
11th తమిళనాడు ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 24 జూన్ 1991 – 12 మే 1996 | |||
ముందు | రాష్టపతి పరిపాలన | ||
తరువాత | ఎం.కరుణానిధి | ||
నియోజకవర్గం | బర్గూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | మైసూర్, భారత దేశం | 1948 ఫిబ్రవరి 24||
మరణం | 05 డిసెంబర్, 2016 చెన్నై, తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | ఎ.ఐ.ఎ.డి.ఎమ్.కె. | ||
నివాసం | పోయస్ గార్డెన్, చెన్నై, భారత దేశం | ||
మతం | హిందూ మతము |
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది.
2014 సెప్టెంబరు 27 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.[2][3] 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది.అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబరు 6న అంత్యక్రియలు జరిగాయి.
జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.[4] జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.
సంవత్సరము | నియోజకవర్గము | ఫలితము | ఓటు శాతము | ప్రత్యర్థి | ప్రత్యర్థి పక్షము | ప్రత్యర్థి ఓట్ల శాతము |
---|---|---|---|---|---|---|
1989 | బోడినాయకనూరు | గెలుపు | 54.51 | ముత్తుమనోహరన్ | డీ.ఎం.కె | 27.27[5] |
1991 | బర్గూరు | గెలుపు | 69.3 | రాజేందర్ | తాయగ మరుమలర్చి కళగము, టి.ఎం.కే | 29.34[6] |
1991 | గాంగేయం | గెలుపు | 63.4 | ఎన్.ఎస్.రాజకుమార్ మండ్రడియార్ | డీ.ఎం.కె | 32.85[7] |
1996 | బర్గూరు | ఓటమి | 43.54 | ఇ.జి.సుఖవనం | డీ.ఎం.కె | 50.71[6] |
2001 | ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదుక్కోట | నామపత్రముల తిరస్కరణ[8] | ||||
2002 | ఆండిపట్టి | గెలుపు | 58.22 | వైగై శేఖర్ | డి.ఎం.కె | 27.64[9] |
2006 | ఆండిపట్టి | గెలుపు | 55.04 | సీమాన్ | డి.ఎం.కె | 36.29[10] |
2011 | శ్రీరంగము | గెలుపు | 58.99 | ఎన్.ఆనంద్ | డి.ఎం.కె | 35.55[11][12] |
2015 | డాక్టర్.రాధాకృష్ణన్ నగర్ | గెలుపు | 88.43 | సి.మహేంద్రన్ | సి.పి.ఐ. | 5.35[13] |
2016 | డాక్టర్.రాధాకృష్ణన్ నగర్ | గెలుపు | 55.87 | సిమ్లా ముత్తుచోళన్ | డి.ఎం.కె | 33.14[14] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.