కన్నడ భాష

ద్రావిడభాషా కుటుంబానికి చెందిన దక్షిణ భారత భాష. కర్నాటక రాష్ట్ర అధికార From Wikipedia, the free encyclopedia

Remove ads

సిరిగన్నడగా పేరొందిన కన్నడ ( ಕನ್ನಡ) పురాతన ద్రావిడ భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు.

మరింత సమాచారం కన్నడ (ಕನ್ನಡ), అధికార స్థాయి ...
కన్నడ మాట్లాడతారు
Remove ads

భాష

కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది, దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉంది.

కన్నడ మూడు విధముల భేదములకు లోబడి ఉన్నది - అవి లింగ, సంఖ్య కాల భేదములు.

Thumb
'కన్నడ భావుటా' - కన్నడ పతాకము

ఈ భాషలో మౌఖిక, లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మాండలికాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, సాగర, ఉడుపి లోని హవ్యక బ్రాహ్మణులది), అరెభాషె (దక్షిణ కర్ణాటక లోని సుళ్య ప్రాంతము), సోలిగ కన్నడ, బడగ కన్నడ, కలబురగి (గుల్బర్గా) కన్నడ, హుబ్బళ్ళి కన్నడ మొదలుగునవి.

ఒక సమీక్ష ప్రకారం, భారత దేశంలోని ఆదళిత భాషాలల్లో అత్యధిక మాండలికం (Dialect) లలో మాట్లాడే భాషాలల్లో కన్నడ భాష అగ్రస్థానంలో ఉంది.

Thumb
వికిపీడియాలో కన్నడ
Remove ads

భౌగోళిక వ్యాప్తి

కన్నడ భాషను ప్రధానముగా భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ,, తమిళునాడు, కేరళ, మహారాష్ట్రలో మాట్లాడుతారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డం, కెనడాలలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు.

Thumb
A Kannada language sign board

అధికారిక స్థాయి

కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష, భారతదేశపు 22 అధికార భాషలలో ఒకటి.

కన్నడ లిపి

కన్నడ అక్షరమాలను ఇక్కడ చూడండి

కన్నడ భాషలో 32 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతము వ్రాయడానికి 16 అక్షరాలు ఉన్నాయి. తమిళం లాగే కన్నడలో కూడా మాహాప్రాణాక్షరాలు ప్రజలు పలుకరు. కేవలం బరహంలో దీన్ని వాడుతారు. కన్నడ లిపి కదంబ లిపినుంది ఉద్భవించింది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి.

లిప్యాంతరీకరణ

ప్రామాణిక కీబోర్డు ఉపయోగించి కన్నడ అక్షరాలను టైప్ చేయడానికి అనేక లిప్యాంతరీకరణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఐట్రాన్స్ పై అధారితమైన బరాహ, కర్ణాటక ప్రభుత్వ కన్నడ లిప్యాంతరీకరణ ప్రామాణికమైన నుడి ముఖ్యమైనవి.

Remove ads

కొన్ని విశేషాలు

  • భారతీయ భాషలలో తొట్టతొలి విజ్ఞానసర్వస్వము కన్నడ భాషలో వెలువొందినదని భావిస్తారు. అది తరువాత శివతత్వరత్నాకరమనే పేరిట సంస్కృతములోకి అనువదించబడింది.

ఇవికూడా చూడండి

తరచూ వాడే కొన్ని వాక్యాలు

  • నమస్కారము: నమస్కార, శరణు, తుళిలు
  • వందనము: వందనెగళు
  • దయచేసి: దయవిట్టు, దయమాడి
  • ధన్యవాదము: ధన్యవాద, నన్నిగళు
  • క్షమించండి: క్షమిసి, మన్నిసి
  • అది: అదు
  • ఎంత?: ఎష్టు
  • అవును: హౌదు
  • లేదు: ఇల్ల
  • నాకు అర్ధం కాలేదు: ననగే తిళియలిల్ల
  • మరుగు దొడ్డి ఎక్కడుంది?: బచ్చలు మనే ఎల్లిదే ?
  • మీకు ఆంగ్లము తెలుసా?: తావు ఆంగ్ల నుడి బల్లిరా ?
  • కర్ణాటకకు స్వాగతము!: కర్ణాటకక్కే నల్బరువు!

కన్నడ నేర్చుకొనుట

సహాయక గ్రంథాలు
Thumb
కన్నడ స్వయం బోధిని
  1. కన్నడ స్వయం బోధిని, కన్నడ అభివృద్ధి ప్రాధికార, బెంగళూరు, ఆంగ్ల మూలం:లింగదేవర హళెమనె, అనువాదం: జిఎస్ మోహన్, 2003

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads