![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/78/Private_key_signing.svg/langte-640px-Private_key_signing.svg.png&w=640&q=50)
డిజిటల్ సంతకం
From Wikipedia, the free encyclopedia
డిజిటల్ సిగ్నేచర్ లేదా డిజిటల్ సంతకం అంటే డిజిటల్ సందేశాలు లేదా పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించడానికి వాడే ఒక గణిత పద్ధతి. ప్రమాణాలకు లోబడిఉన్న డిజిటల్ సంతకం ఉంటే సందేశం లేదా పత్రాన్ని అందుకున్న గ్రహీత అది సరైన వ్యక్తి నుంచి వచ్చిందనీ (ప్రామాణీకరణ - authenticity), ఇంకా దాన్ని మధ్యలో ఎవరూ మార్చలేదని (సమగ్రత - integrity) విశ్వసించవచ్చు.[1]
![]() | This article may require cleanup to meet Wikipedia's quality standards. The specific problem is: ,, యొక్క. (నవంబర్ 2020) |
![Alice signs a message—"Hello Bob!"—by appending to the original message a version of the message encrypted with her private key. Bob receives the message, including the signature, and using Alice's public key, verifies the authenticity of the message, i.e. that the signature can be decrypted to match the original message using Alice's public key.](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/78/Private_key_signing.svg/320px-Private_key_signing.svg.png)
డిజిటల్ సంతకాలు చాలా క్రిప్టోగ్రఫిక్ (గూఢ లిపి) ప్రోటోకాల్ సూట్లలో ఒక కీలకమైన అంశం. వీటిని సాధారణంగా సాఫ్ట్వేర్ పంపిణీ, ఆర్థిక లావాదేవీలు, ఒప్పంద నిర్వహణ సాఫ్ట్వేర్, ఫోర్జరీ (దొంగ సంతకం) లేదా ట్యాంపరింగ్ (సాక్ష్యాలను మార్చడం) ను గుర్తించడం లాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు.
డిజిటల్ సంతకాలు తరచూ ఎలక్ట్రానిక్ సంతకాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ డేటాకైనా సంతకం చేసే పంపాలని భావించినపుడు ఉన్నప్పుడు దీన్ని వాడవచ్చు.[2] అయితే అన్ని ఎలక్ట్రానిక్ సంతకాలు డిజిటల్ సంతకాలు కావు.[3][4] కెనడా,[5] దక్షిణాఫ్రికా,[6] యునైటెడ్ స్టేట్స్, అల్జీరియా,[7] టర్కీ, ఇండియా,[8] బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా,[9] ఉరుగ్వే,[10] స్విట్జర్లాండ్, చిలీ,[11] యూరోపియన్ యూనియన్ దేశాలలో,[12][13] ఎలక్ట్రానిక్ సంతకాలకు చట్టపరమైన ప్రాముఖ్యత ఉంది.
డిజిటల్ సంతకం చేసిన ఫైల్ యొక్క సమగ్రతను ధ్రువీకరించడం సులభం (ముద్ర, సంతకం లేదా చేతివ్రాత ధ్రువీకరణ అవసరం లేదు),, డిజిటల్ సంతకం తిరస్కరించబడనిది అని ధ్రువీకరించడానికి చేతివ్రాత నిపుణులు అవసరం లేదు.