బ్రెజిల్
From Wikipedia, the free encyclopedia
బ్రెజిల్ [6] అధికార నామం "బ్రెజిల్ సమాఖ్య గణతంత్రం".[7] దక్షిణ అమెరికా దేశాలలో అతి పెద్ద దేశం. వైశాల్యం రీత్యా ప్రపంచములోనే ఐదవ అతిపెద్ద దేశమైన బ్రెజిల దక్షిణ అమెరికా భూభాగంలో దాదాపు సగం విస్తీర్ణాన్ని కైలిగి ఉంటుంది. జనాభా లెక్కల రీత్యా కూడా ప్రపంచములోనే ఆరవ అతిపెద్ద దేశమైన బ్రెజిల్ నాల్గవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. పోర్చుగీస్ భాషను అధికార భాషగా కలిగిన అతిపెద్ద దేశంగా ప్రత్యేకత కలిగి ఉంది.[8][9] తూర్పు సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం ఉన్న బ్రెజిల్ సముద్ర తీరం పొడవు 7,491 కిలోమీటర్ల కంటే అధికంగా ఉంది.[10] దేశసరిహద్దులో ఈక్వడార్, చిలీ మినహా మిగిలిన అన్ని దేశాలు ఉన్నాయి.దక్షిణ అమెరికా ఖండంలో 45.3% భూభాగం ఆక్రమించుకుని ఉంది.[11] బ్రెజిల్ లోని అమెజాన్ నదీముఖద్వారంలో విస్తారమైన ఉష్ణమండల అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.వైవిధ్యమైన పర్యావరణం, విస్తారమైన జంతుజాలం, విస్తారమైన సహజ వనరులకు, అభయారణ్యాలకు ఇది నిలయంగా ఉంది.[10] అసమానమైన పర్యావరణం బ్రెజిల్‌ను 17 మహావైవిధ్యభరితమైన దేశాలలో ఒకటిగా చేసింది. పర్యావరణ పరిరక్షణ, అరణ్యాల నిర్మూలన వంటి చర్చలకు బ్రెజిల్ కేంద్రంగా ఉంది.
పోర్చుగీస్ సామ్రాజ్యం ప్రాంతానికి చెందిన ప్రాంతం అయిన 1500లో అన్వేషకుడు " పెడోరో అల్వరేస్ కాబ్రాల్ " ఈప్రాంతానికి చేరడానికి ముందు ల్యాండింగ్ చేరి ఈప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పోర్చుగీస్ సామ్రాజ్యంలో విలీనం చేయడానికి ముందు ఈ ప్రమ్ంతంలో పలు గిరిజన ప్రజలు దేశాలు స్థాపించుకుని నివసించారు. 1808 వరకు బ్రెజిల్ పోర్చుగీస్ కాలనీగా మిగిలిపోయింది. సామ్రాజ్యం యొక్క రాజధాని లిస్బన్ నుండి రియో డి జనీరోకు బదిలీ చేయబడిన సమయంలో పోర్చుగీసు న్యాయస్థానం బ్రెజిల్‌కు బదిలీ చేయబడింది. 1815 లో పోర్చుగల్ బ్రెజిల్, అల్గార్వ్స్ యునైటెడ్ కింగ్డమ్ ఏర్పడినప్పుడు ఈ కాలనీ రాజ్యం స్థాయికి అభివృద్ధి చెందింది. 1822 లో బ్రెజిలియన్ స్వాతంత్ర్యంగా బ్రెజిల్ సామ్రాజ్యం సృష్టించడి రాజ్యాంగ రాచరికం, ఒక పార్లమెంటరీ వ్యవస్థలో పాలించబడే ఒక ఏకీకృత దేశం అయింది. 1824 లో మొట్టమొదటి రాజ్యాంగం ఆమోదం పొందిన ద్విసభ శాసనసభ ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం బ్రెజిల్ " నేషనల్ కాంగ్రెస్ అఫ్ బ్రెజిల్ " అని పిలవబడుతుంది. 1889 లో సైనిక తిరుగుబాటు తరువాత బ్రెజిల్ దేశము ప్రెసిడెంషియల్ రిపబ్లిక్‌గా మారింది. 1964 లో సైనిక తిరుగుబాటు తరువాత అధికారిక " బ్రెజిలియన్ సైనిక నియంతృత్వం " ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1985 వరకు పాలించారు. తరువాత ప్రజాపాలన తిరిగి ప్రారంభమైంది. 1988 లో రూపొందించిన బ్రెజిల్ ప్రస్తుత రాజ్యాంగం " ఫెడరల్ రిపబ్లిక్ "గా గుర్తించబడుతుంది.1500 సంవత్సరము నుండి 1822లో స్వాతంత్ర్యము పొందేవరకు బ్రెజిల్ పోర్చుగల్ పరిపాలనలో ఉంది. బ్రెజిల్ ఐక్య రాజ్య సమితి స్థాపక దేశాలలో ఒకటి.[12] " ఫెడరేషన్ డిస్ట్రిక్ "లో 26 రాష్ట్రాలు , 5,570 పురపాలకాలు భాగంగా ఉన్నాయి.ప్రపంచ అత్యున్నత 8 ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ ఆర్థికవ్యవస్థగా ఉంది. [13][14] బ్రెజిల్ " బి.ఆర్.ఐ.సి.ఎస్ " సభ్యదేశాలలో ఒకటిగా ఉంది. 2010 వరకు బ్రెజిల్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా అంతర్జాతీయ గుర్తింపు పొందది అతివేగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది.[15] దేశాభివృద్ధిలో " బ్రెజిలియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ " ప్రధానపాత్ర వహించింది.[16] బ్రెజిల్ యునైటెడ్ నేషన్స్, జి -20 ప్రధాన ఆర్థిక వ్యవస్థ (జి 20), బ్రిక్స్, దక్షిణ అమెరికా నేషన్స్ యూనియన్, మెర్కోసర్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఐబెరో-అమెరికన్ స్టేట్స్ , కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ భాషా దేశాలు సంస్థలకు ఫండింగ్ సభ్యత్వదేశాలలో ఒకటిగా ఉంది. బ్రెజిల్ లాటిన్ అమెరికాలో ప్రాంతీయ శక్తి , అంతర్జాతీయ వ్యవహారాలలో " మిడిల్ పవర్ "గా గుర్తించబడుతుంది.[17] కొంతమంది విశ్లేషకులు బ్రెజిల్‌ను " ఎదుగుతున్న అంతర్జాతీయశక్తిగా " గుర్తిస్తున్నారు.[18] బ్రెజిల్ 150 సంవత్సరాలుగా కాఫీ ఉత్పత్తి చేస్తుంది.కఫీ బ్రెజిల్ ఆర్ధికవ్యవస్థలో ప్రధానపాత్రవహిస్తుంది.[19]