తెలుగు
భారతీయ భాష. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార భాష / From Wikipedia, the free encyclopedia
తెలుగు అనేది ద్రావిడనుడి కుటుంబానికి చెందిన నుడి. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ఉండగా తెలుగును మున్నధికారిక నుడిగా వాడుతారు. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే మున్నధికారిక నుడులలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి.[5][6] పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక నుడి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన చిన్నవీటి నుడి. భారత ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించిన ఆరునుడులలో తెలుగు ఒకటి.[7][8]
తెలుగు | |
---|---|
తెలుగు | |
ఉచ్ఛారణ | మూస:IPA-te |
స్థానిక భాష | భారతదేశం |
ప్రాంతం | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ |
స్వజాతీయత | తెలుగు ప్రజలు |
స్థానికంగా మాట్లాడేవారు | 82 మిలియన్లు (2011)[1][2] L2 మాట్లాడేవారు: 11 మిలియన్లు[1] |
భాషా కుటుంబం | ద్రావిడ
|
తొలిరూపు | పాత తెలుగు
|
ప్రాంతీయ రూపాలు |
|
వ్రాసే విధానం | తెలుగు అక్షరమాల తెలుగు బ్రెయిలీ |
సంజ్ఞా రూపాలు | Signed Telugu |
అధికారిక హోదా | |
అధికార భాష | India
|
గుర్తింపు పొందిన అల్పసంఖ్యాకుల భాష | |
భాషా సంకేతాలు | |
ISO 639-1 | te |
ISO 639-2 | tel |
ISO 639-3 | tel – inclusive codeIndividual code: wbq – వడ్డర్ (వాడారి) |
Linguist List | tel |
Glottolog | telu1262 తెలుగుoldt1249 పాత తెలుగు |
Linguasphere | 49-DBA-aa |
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో స్థానిక ప్రజా భాష తెలుగు | |
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA. |
భారతదేశంలో ఎటువంటి అధికారిక ఉనుగడ లేకుండా రెండువేల పైనాటినుండే తెలుగు మాట్లాడ్తున్నట్టుగా తెలియజేయబడింది, 2011 జనాభా లెక్కబట్టి దాదాపు 82 వేల్వేలాదిమంది పైన ఇప్పుడు మాట్లాడేవారున్నారు.[9] భారతదేశంలో అమ్మనుడిగా తెలుగు నాలుగో నెలకువలో ఉండగా, ప్రపంచప్రాకింతగా ఎథ్నోలాగ్ జాబితాలో 15వ నెలకువలో ఉంది.[10][11] ఇది ద్రావిడనుడి కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే నుడి. భారతదేశంలో ఇరవైరెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి.[12] ఇది అమెరికాలో వేగంగా పెంపొందుతున్న నుడి.[13] తెలుగు నుడిలో సుమారు 10,000 పాత శాసనాలు ఉన్నాయి.[14] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు నుడిని 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని పొగిడినారు. కన్నడ, తెలుగు వర్ణమాల చాలా వరకు పోలికగలిగి వుంటాయి.