పంజాబీ భాష
ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన ఒక భారతీయ భాష / From Wikipedia, the free encyclopedia
పంజాబీ /pʌnˈdʒɑːbi/[5] (షాముఖీ: پنجابی [paṉjābī] Error: {{Transliteration}}: unrecognized language / script code: Punjabi (help); గురుముఖీ: ਪੰਜਾਬੀ pañjābī)[6] ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో (2015 నాటికి) ఉన్న భాష.[7][8]. పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష.[9][10][11][12]
పంజాబీ | |
---|---|
ਪੰਜਾਬੀ • پنجابی | |
స్థానిక భాష | పంజాబ్ ప్రాంతం |
స్థానికంగా మాట్లాడేవారు | 100 మిలియన్, లహందా మాండలీకాలతో కలిపి (2010)[1] |
భాషా కుటుంబం | ఇండో-యూరోపియన్
|
ప్రామాణిక రూపాలు | మాఝి
హింద్కో
సరైకీ
|
వ్రాసే విధానం | షాముఖీ (విస్తరించిన పెర్సో-అరబిక్ లిపి) గురుముఖీ (బ్రాహ్మిక్)[3] పంజాబీ బ్రెయిలీ (India) దేవనాగరి (బ్రాహ్మిక్, అనధికారికం)[4] |
అధికారిక హోదా | |
అధికార భాష | India (పంజాబ్, చండీగఢ్ లలో అధికారిక భాష, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో రెండవ స్థాయి అధికారిక గుర్తింపు గల భాష Pakistan పంజాబ్, పాకిస్తాన్ ప్రావిన్షియల్ భాష |
భాషా సంకేతాలు | |
ISO 639-1 | pa |
ISO 639-2 | pan |
ISO 639-3 | pan – inclusive codeIndividual codes: bhd – భద్రవాహీ [lower-alpha 1]bht – భట్టియాలీkfs – బిలాస్ పురీcdh – చంబేలీcdj – చురాహీdoi – డోగ్రీdgo – డోగ్రీ (స్థిరం)gbk – గద్ది (భర్మౌరీ)kjo – హరిజన్ కిన్నౌరీhii – హిందూరీjat – జకాతీjns – జౌన్సారీhno – ఉత్తర హింద్కోxnr – కంగ్రీxhe – ఖేత్రానీkfx – రుల్లు పహారీdoi – లహందాbfz – మహసు పహారీmjl – మందేలీpnb – పహేరీ పొతొహరీpgg – పంగ్వాలీskr – సరైకీsrx – సిర్మౌరీhnd – దక్షిణ హింద్కోpnb – పశ్చిమ పంజాబీ |
Glottolog | panj1256 పంజాబీ |
Linguasphere | 59-AAF-e |
ఇతర ఇండో-ఆర్యన్ భాషల(ముదురు బూడిద రంగు)తో పోలుస్తూ పంజాబీ స్థానిక భాషగా కలిగిన ప్రాంతాలు (ఎరుపు) | |
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA. |
పంజాబీ పాకిస్తాన్ లో అత్యంత విస్తారంగా మాట్లాడే భాష,[13] భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానాల్లో పదకొండవది,[14] భారత ఉపఖండంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో ఉంది. అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో యునైటెడ్ కింగ్డమ్ లో 4 స్థానంలో[15] అత్యధికులకు మాతృభాషగా కలిగిన భాషల్లో కెనడాలో మూడవ స్థానంలో (ఆంగ్లం, ఫ్రెంచి తర్వాత).[16][17] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. బాలీవుడ్ సినిమాల్లో పలు గీతాలు పాక్షికంగానూ, పూర్తిగానూ పంజాబీలోనే పాడివుండడం భారత ఉపఖండ వ్యాప్తంగా పంజాబీకి సాంస్కృతిక లింకులా అమరింది.[18][19][20]