మెట్రోపాలిటన్ ప్రాంతం
జనసాంద్రత కలిగిన పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు, గృహనిర్మాణ అవసరాలకు సంబంధించిన పరిపాలనా వి / From Wikipedia, the free encyclopedia
మెట్రోపాలిటన్ ప్రాంతం, జనసాంద్రత కలిగిన పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు, గృహనిర్మాణ అవసరాలకు సంబంధించిన పరిపాలనా విభాగ ప్రాంతం. తక్కువ జనాభా కలిగిన పరిసర ప్రాంతాలను కలిపి మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏర్పాటుచేయబడుతుంది.[1]
మహానగర ప్రాంతం, పురపాలక సంఘాలు: పరిసర ప్రాంతాలు, టౌన్ షిప్, స్వయం పాలిత ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు, శివారు ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల, దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలు మారినప్పుడు, మెట్రోపాలిటన్ ప్రాంతాలు కీలకమైన ఆర్థిక, రాజకీయ ప్రాంతాలుగా మారాయి.[2] నగరాలు, పట్టణాలు, పట్టణ ఆర్థిక కేంద్రంగా సామాజిక, ఆర్ధికంగా ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంతాలు మొదలైనవి మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఉంటాయి.[3]