విజాగపటం యుద్ధం
From Wikipedia, the free encyclopedia
విజాగపటం యుద్ధం అనేది నెపోలియన్ యుద్ధాల సమయంలో 1804 సెప్టెంబరు 15 న బంగాళాఖాతంలో బ్రిటిషు భారతదేశంలో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని విజాగపటం నౌకాశ్రయానికి దగ్గరలో జరిగిన చిన్న నౌకాదళ యుద్ధం. మారెంగో నౌకలో కాంట్రే-అడ్మిరల్ చార్లెస్-అలెగ్జాండ్రే లియోన్ డ్యురాండ్ లినోయిస్ ఆధ్వర్యంలోని ఫ్రెంచ్ స్క్వాడ్రన్ బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఫోర్త్ రేట్ షిప్ HMS సెంచూరియన్, హార్బర్ రోడ్లలో లంగరు వేసిన రెండు ఈస్ట్ ఇండియామాన్ వాణిజ్య నౌకలపై దాడి చేసింది. ముందు నుండి లినోయిస్, వాణిజ్య నౌకలపై దాడులు చెయ్యడంలో నిమగ్నమై ఉంది. అప్పటికే అది దక్షిణ చైనా సముద్రంలో, మొజాంబిక్ ఛానెల్లో, సిలోన్కు వెలుపల, బంగాళాఖాతంలోని భారత తీరం వెంబడి కార్యకలాపాలను చేస్తూ ఉంది. 1804 ఫిబ్రవరి 15న పులో ఆరా యుద్ధంలో ఫ్రెంచ్ స్క్వాడ్రన్ ఒక ముఖ్యమైన యుద్ధంలో పోరాడింది. దీనిలో లినోయిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ (HEIC) వారి చైనా ఫ్లీట్‌పై దాడి చేసింది. ఇది £8 మిలియన్ల విలువైన సరుకును మోసుకెళ్ళే సాయుధ వ్యాపార నౌకలతో కూడిన పెద్ద కాన్వాయ్. ఆ కాన్వాయ్‌పై దాడి చేయలేక లినోయిస్, తన స్క్వాడ్రన్తో సహా పారిపోయాడు.
విజాగపటం యుద్ధం | |||||||
---|---|---|---|---|---|---|---|
నెపోలియన్ యుద్ధాలులో భాగము | |||||||
విజాగపటం రోడ్డులో సెంచూరియన్ రక్షణ 1804 సెప్టెంబరు 15, థామస్ సదర్లాండ్ | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
France | United Kingdom | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
చార్లెస్ లినోయిస్ | జేమ్స్ లిండ్ | ||||||
బలం | |||||||
1 యుద్ధ నౌక 2 ఫ్రిగేట్లు | 1 యుద్ధ నౌక 2 వాణిజ్య నౌకలు | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
11 మంది మరణాలు/గాయాలు | 10 మంది మరణాలు/గాయాలు 1 వాణిజ్య నౌక ధ్వంసం 1 వాణిజ్య నౌకను పట్టుకున్నారు |
పులో ఆరాలో విఫలమైన తరువాత లినోయిస్, హిందూ మహాసముద్రంలో ప్రయాణించాడు. 1804 ఆగస్టు సెప్టెంబరుల్లో అతని స్క్వాడ్రన్, బంగాళాఖాతంలో భారత తీరం వెంబడి సిలోన్ నుండి ఉత్తరం వైపు ప్రయాణిస్తూ అనేక విలువైన వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. మసూలిపటం నుండి స్వాధీనం చేసుకున్న ఓడ నుండి లినోయిస్, విశాఖపట్నంలో, ఈస్ట్ ఇండియామెన్ వాణిజ్యనౌకలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. బ్రిటిషు రియర్-అడ్మిరల్ పీటర్ రైనియర్, ఆ వాణిజ్య నౌకల కాన్వాయ్‌కు రక్షణగా గతంలో ఉండే చిన్న యుద్ధనౌక HMS విల్హెల్మినా స్థానంలో పెద్దదైన సెంచూరియన్‌ను పెట్టాడు. ఆ సంగతి తెలియని లినోయిస్, ఆ కాన్వాయ్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.