జనవరి 2–అలెగ్జాండర్ పోప్ కవిత ఎపిస్టల్ టు డాక్టర్ అర్బుత్నాట్లండన్లో ప్రచురించారు.
ఫిబ్రవరి 14: పీటర్ ది గ్రేట్ కుమార్తె గౌరవార్థం, రష్యాలో ఆర్డర్ ఆఫ్ సెయింట్ అన్నా స్థాపించారు.
ఏప్రిల్ 13: సాకురామాచి చక్రవర్తి జపాన్ సింహాసనాన్ని అధిష్టించాడు.
మే 22: జార్జ్ హాడ్లీ వాణిజ్య పవనాల గురించిన మొదటి వివరణను ప్రచురించాడు. [1][2][3]
జూలై 11: ప్లూటో, నెప్ట్యూన్ కక్ష్యలోపలికి ప్రవేశించింది (అప్పటికి ఇంకా ఈ సంగతి తెలియదు). పద్నాలుగు సంవత్సరాల పాటు అది నెప్ట్యూన్ కక్ష్య లోపలే ఉంటుంది. ఇది మళ్ళీ 1979లో జరుగుతుంది..
అక్టోబర్ 18: కియాన్లాంగ్ చక్రవర్తి తన తండ్రి యోంగ్జెంగ్ చక్రవర్తి తరువాత, క్వింగ్ రాజవంశం యొక్క 60 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు.
తేదీ తెలియదు: లిన్నెయస్ తన సిస్టమా నాచురేను ప్రచురించాడు.
తేదీ తెలియదు: ముంబైలో ఓడల నిర్మాణ పరిశ్రమ ప్రారంభమైంది.
తేదీ తెలియదు: లియోన్హార్డ్ ఐలర్ బాసెల్ సమస్యను, కోనిగ్స్బర్గ్ యొక్క ఏడు వంతెనల సమస్యనూ పరిష్కరించాడు,
తేదీ తెలియదు: జార్జ్ బ్రాండ్ కోబాల్ట్ను కనుగొన్నాడు
తేదీ తెలియదు: ఫ్రెంచ్ సర్జన్ క్లాడియస్ ఐమండ్ లండన్లో మొట్టమొదటి విజయవంతమైన అపెండిసైటిస్ ఆపరేషను చేసాడు .